టాలీవుడ్లో త్వరలోనే సూపర్ హిట్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. అరవింద సమేత తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. వచ్చే నెలలో ఉగాది సందర్భంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోబోతున్నట్లు, నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా రకరకాల పేర్లను పరిశీలించి చివరికి రష్మిక మందన్నాను ఓకే చేసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇప్పుడు మరింత స్పష్టత వచ్చేసింది. ఆదివారం రష్మిక.. తన టీంతో కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను కలిసింది. ఆయనతో సమావేశమై బయటికి వస్తుండగా.. కెమెరాలకు చిక్కింది రష్మిక.
ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాకు సంబంధించి కథా చర్చల కోసమే ఆమె త్రివిక్రమ్‌ను కలిసినట్లు తెలుస్తోంది. కథతో పాటు రష్మిక పాత్ర గురించి త్రివిక్రమ్ నరేషన్ ఇచ్చినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాబట్టి ఎన్టీఆర్ సరసన రష్మిక నటించబోతున్నట్లే. వీరి కలయికలో ఇదే తొలి సినిమా. త్రివిక్రమ్‌తోనూ రష్మిక చేయనున్న తొలి సినిమా ఇదే. మరోవైపు ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటి, ఒకప్పటి కథానాయిక అర్చనను ఓకే చేసినట్లు సమాచారం.
నిరీక్షణ, లేడీస్ టైలర్ లాంటి సినిమాలతో అర్చన కథానాయికగా బలమైన ముద్రే వేసింది. ఆమె జాతీయ ఉత్తమ నటి పురస్కారం కూడా అందుకుంది. ఆమె సినిమాలు చేసి చాలా కాలం అయిపోయింది. నదియా, ఖుష్బు లాంటి సీనియర్ నటీమణులకు తన సినిమాల్లో ప్రత్యేక పాత్రలు ఇచ్చిన త్రివిక్రమ్.. ఇప్పుడు అర్చనకు అవకాశమిస్తుండటం విశేషం. త్రివిక్రమ్ మాతృ సంస్థ అనదగ్గ హారిక హాసిని క్రియేషన్స్ బేనర్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చనున్నాడు.
This post was last modified on March 22, 2021 6:29 pm
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…