కొత్త సినిమాలు వద్దు.. పాత సినిమానే ముద్దు. లాక్ డౌన్ బ్రేక్ తర్వాత టాలీవుడ్ ప్రేక్షకులు చూపిస్తున్న కొత్త ట్రెండ్ ఇది. వారం వారం కొత్త సినిమాలు వస్తున్నప్పటికీ.. వాటి కంటే ముందు నుంచి ఆడుతున్న పాత సినిమాకు పట్టం కట్టడం సంక్రాంతి నుంచి చూస్తూనే ఉన్నాం. ఆ పండుగ టైంలో క్రాక్ సినిమాను అలాగే మూడు నాలుగు వారాల పాటు నెత్తిన పెట్టుకున్నారు. ఆపై ఫిబ్రవరిలో వచ్చిన ఉప్పెన సినిమా నెల రోజుల పాటు వారాల పాటు హవా సాగించింది.
ఇక గత వారం వచ్చిన జాతిరత్నాలు కూడా ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. ఈ వారం వచ్చిన కొత్త సినిమాలు దాని ముందు నిలిచే పరిస్థితి కనిపించడంలేదు. ఈ శుక్రవారం చావు కబురు చల్లగా, మోసగాళ్ళు, శశి చిత్రాలు విడుదలైన సంగతి తెలిసిందే. వీటిలో దేనికీ అంత మంచి టాక్ రాలేదు. వీటికి ప్రి రిలీజ్ బజ్ కూడా మరీ ఎక్కువగా లేదు. దీంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. శుక్రవారం మాత్రమే ఈ మూడు చిత్రాలు కొంత ప్రభావం చూపించాయి. అయినా సరే.. ఆ రోజు జాతిరత్నాలుదే పైచేయి అయింది.
శనివారం అయితే ఈ సినిమా ధాటికి మిగతా మూడు నిలవలేకపోయాయి. హైదరాబాద్‌లో సినిమా హబ్ అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో శనివారం పాత సినిమా అయిన జాతిరత్నాలు రోజు మొత్తంలో రూ.4.2 లక్షల గ్రాస్ కలెక్ట్ చేస్తే.. కొత్త సినిమా అయిన చావు కబురు చల్లగా రూ.1.57 లక్షల గ్రాస్‌తో రెండో స్థానంలో నిలిచింది. మిగతా రెండు కొత్త చిత్రాలు మోసగాళ్లు, శశి వరుసగా రూ.52 వేలు, రూ.38 వేల గ్రాస్‌కు పరిమితం అయ్యాయి. మూడు కొత్త చిత్రాల వసూళ్లు కలిపినా.. జాతిరత్నాలు కలెక్షన్ల కంటే తక్కువగా ఉండటాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on March 21, 2021 1:55 pm
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……