తన కెరీర్‌ను పక్కా ప్లానింగ్‌తో ముందుకు తీసుకెళ్తున్నాడు యువ కథానాయకుడు రామ్. ఒక పక్క లవ్ స్టోరీలు చేస్తున్నాడు.. ఇంకోపక్క కొత్త తరహా థ్రిల్లర్లు చేస్తున్నాడు.. మరోపక్క ఊర మాస్ సినిమలూ లైన్లో పెడుతున్నాడు. అన్నీ కూడా అతడికి బాగానే కలిసొస్తున్నాయి. రెండు వరుస ఫ్లాపుల తర్వాత ప్రేమకథా చిత్రం ‘హలో గురూ ప్రేమ కోసమే’తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రామ్.. ఆ తర్వాత మాస్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సంక్రాంతికి ‘రెడ్’ లాంటి ప్రయోగాత్మక చిత్రంతోనూ అతను మంచి ఫలితమే అందుకున్నాడు. దీని తర్వాత తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో అడుగులు వేస్తున్నాడు రామ్. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు రాష్ట్రాల అవతల కూడా ఫాలోయింగ్ పెంచుకుంటున్న రామ్.. తాను పాన్ ఇండియా సినిమా చేయడానికి ఇదే సరైన సమయంగా భావించాడు.
తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామితో ఇటీవలే రామ్ ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉప్పెన సెన్సేషన్ కృతి శెట్టి ఇందులో కథానాయిక. ఈ సినిమా ఇప్పుడే మొదలు కాగా.. ఇంతలోనే రామ్ తన తర్వాతి సినిమాకు కూడా రంగం సిద్ధం చేశాడు. అతను స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం బోయపాటి.. నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాని తర్వాత ఆయనతో సినిమా చేయడానికి ఏ పెద్ద హీరో కూడా ఖాళీగా లేడు. ఇది రామ్‌కు కలిసొచ్చింది.
లింగుస్వామితో చేసేది కొంచెం కొత్త తరహా కథ అట. వరుసగా రెండు డిఫరెంట్ సినిమాలు చేశాక మళ్లీ ‘ఇస్మార్ట్ శంకర్’ తరహాలో ఊర మాస్ సినిమా చేయాల్సిన అవసరం ఉందని రామ్ భావించి.. బోయపాటితో జట్టు కట్టనున్నట్లు సమాచారం. బోయపాటితో ‘జయ జానకి నాయక’తో పాటు బాలయ్య సినిమాను కూడా నిర్మిస్తున్న మిర్యాల రవీందర్ రెడ్డే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాడట.
This post was last modified on March 21, 2021 8:41 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…