రెండు దశాబ్దాల కిందట అమితాబ్ బచ్చన్ ఘన వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అభిషేక్ బచ్చన్. తండ్రి స్థాయిని అతను అందుకుంటాడని ఎవ్వరూ అనుకోలేదు. ఆయనలో సగం రేంజి అందుకున్నా గొప్పే అనుకున్నారు. కానీ ‘స్టార్’ అనిపించుకోవడానికి జూనియర్ బచ్చన్ ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నాడు. కెరీర్లో హిట్టయితే ఉన్నాయి కానీ.. ఏవి కూడా అతడి ఇమేజ్‌ను, మార్కెట్‌ను పెంచలేకపోయాయి. లేక లేక ఒక మంచి కథ తన చేతికి వచ్చిందని, ఈ సినిమాతో తన దశ తిరిగిపోతుందని ఒక ప్రాజెక్టుపై అతను ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆ చిత్రమే.. బిగ్ బుల్. నిజానికి ఇది మంచి కంటెంట్ ఉన్న సినిమానే. షేర్ మార్కెట్లో భారీ స్కామ్ చేసి 90వ దశకంలో సంచలనాలకు తెర తీసిన హర్షద్ మెహతా కథతో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమా కోసం అభిషేక్ చాలా కష్టపడ్డాడు. సినిమా కూడా బాగానే వచ్చినట్లుంది. కానీ ఇదే కథతో వేరే వెబ్ సిరీస్ తెరకెక్కడం దీనికి ప్రతికూలమైంది.
‘స్కామ్ 1992’ పేరుతో హన్సల్ మెహతా.. హర్షద్ మెహతా కథను అద్భుత రీతిలో తెరకెక్కించాడు. కొన్ని నెలల కిందట పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ఆ సిరీస్ సంచలనాలు రేపింది. ఇండియన్ వెబ్ సిరీస్‌ల చరిత్రలోనే ది బెస్ట్ అనిపించుకుంది. అప్పట్నుంచి మొదలైంది ‘బిగ్ బుల్’కు తలనొప్పి. సినిమా ఎఫ్పుడో రెడీ అయినా.. వెంటనే రిలీజ్ చేస్తే ‘స్కామ్ 1992’ ప్రభావం పడుతుందని ఆపారు. చివరికి ఏప్రిల్ 8న హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కు సన్నాహాలు చేశారు. ఈ రోజు ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ ఆసక్తికరంగా అనిపిస్తున్నా.. హర్షద్ మెహతా పాత్రలో బాగానే చేసినట్లు కనిపిస్తున్నా.. ‘స్కామ్ 1992’ జనాల మనసుల్లోంచి ఇంకా పోకపోవడం వల్ల దీన్ని దాంతో పోల్చి చూస్తున్నారు. అలా పోల్చినపుడే ‘బిగ్ బుల్’ సాధారణంగా కనిపిస్తోంది. ‘స్కామ్ 1992’తో పోలిక రాకుండా ఏరి ఏరి సన్నివేశాలు, షాట్లను పేర్చినట్లున్నారు ‘బిగ్ బుల్’ ట్రైలర్లో. అయినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ఈ ట్రైలర్ కింద కామెంట్లు చూస్తేనే అర్థమవుతుంది జనాలపై ‘స్కామ్ 1992’ ఎఫెక్ట్ చాలా ఉందని, ‘బిగ్ బుల్’పై వారికి పాజిటివ్ ఫీలింగ్ లేదని. ఈ నేపథ్యంలో ‘బిగ్ బుల్’ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడం చాలా కష్టం లాగే ఉంది.
This post was last modified on March 20, 2021 9:08 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…