టాలీవుడ్లో కొత్త స్టార్ అవతరించాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హీరోగా తొలి హిట్ కొట్టిన నవీన్ పొలిశెట్టి.. ఇప్పుడు ‘జాతిరత్నాలు’తో బంపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో నవీన్ పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా అదరగొట్టినప్పటికీ.. నవీన్ స్క్రీన్ ప్రెజెన్స్, నటన, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ వావ్ అనిపించాయి. ప్రేక్షకులు అతణ్ని ఎంతగా ఓన్ చేసుకుంటున్నారో ‘జాతిరత్నాలు’ థియేటర్లలో స్పందన చూస్తే అర్థమవుతుంది. తనపై తెలుగు ప్రేక్షకులు ఇంత ప్రేమ కురిపించేసరికి నవీన్ ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడు.
‘జాతిరత్నాలు’ సక్సెస్ మీట్‌లో అతను మాట్లాడుతూ.. తన పాత రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. తన తల్లిదండ్రులు ఒకప్పుడు వీకెండ్లో తనను తీసుకుని హైదరాబాద్ నెక్లస్ రోడ్, ట్యాంక్ బండ్ మీద తిప్పి.. ఆ తర్వాత ప్రసాద్ ఐమాక్స్‌కు వచ్చి సినిమా చూపించేవారని.. అదే తమ వీకెండ్ వినోదం అని.. ఇప్పుడు అదే ప్రసాద్ ఐమాక్స్‌లో తన సినిమా వారం రోజులుగా హౌస్ ఫుల్స్‌తో నడుస్తోందని.. ఇంతకంటే తనకు ఏం కావాలని నవీన్ అన్నాడు. తెలుగు ప్రేక్షకులు తమపై ఇంత ప్రేమ చూపిస్తారని ఊహించలేదని అతనన్నాడు.
ఈ సినిమా ఇలాంటి ఫలితాన్ని అందుకున్నాక తనకో ఆలోచన వచ్చిందని.. మామూలుగా కొత్త హీరోలు నటించిన సినిమా చూస్తూ ‘‘ఈ హీరో ఏ ఫ్యామిలీ’’ అని అడుగుతుంటారని.. తన విషయంలో అలా ఎవరైనా అడిగితే.. మీ ఫ్యామిలీ అని చెప్పండని ప్రేక్షకులకు అతను సూచించాడు. ‘జాతిరత్నాలు’ సినిమా ప్రమోషన్లలో, విజయోత్సవాల్లో తాను, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మాత్రమే కనిపిస్తున్నామని.. నిజానికి తెర వెనుక హీరోలు నిర్మాతలైన నాగ్ అశ్విన్, ప్రియాంక, స్వప్నలే అని.. వాళ్లే ఈ సినిమాకు సంబంధించి నిజమైన జాతి రత్నాలని నవీన్ అన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రమోషన్లలో పాల్గొన్న ‘జాతిరత్నాలు’ టీం ఇక అమెరికాకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేయబోతుండటం విశేషం.
This post was last modified on March 19, 2021 10:06 am
విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యంత కీలకమైన సినిమా.. కింగ్డమ్. విజయ్ గత చిత్రాలు లైగర్, ఫ్యామిలీ స్టార్ ఎంత పెద్ద…
ఏపీ సీఎం చంద్రబాబుకు చిర్రెత్తుకొస్తే.. ఏం జరుగుతుందో తాజాగా అదే జరిగింది. ఒక్క దెబ్బకు 284 మంది ఔట్ సోర్సింగ్…
ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా చేసిన ఓ పని.. నెటిజన్లనే కాదు.. చూసిన ప్రజలను కూడా ఫిదా అయ్యేలా చేసింది.…
వైసీపీ హయాంలో ఏపీలో లిక్కర్ కుంభకోణం జరిగిందని.. దాదాపు 2 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైసీపీ కీలక నాయకులు…
తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిశిత విమర్శలు గుప్పించారు. ``అడవుల్లోకి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో పర్యటించారు.…