జాతిరత్నాలు లాంటి చిన్న సినిమా ‘బాహుబలి’ని బీట్ చేయడమేంటి… అది ఏ రకంగా అని సందేహాలు కలుగుతున్నాయా? కానీ ఇది నిజం. హైదరాబాద్‌లో సినిమా థియేటర్ల హబ్‌గా పేరున్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘జాతిరత్నాలు’ మూడో స్థానానికి చేరుకోవడం విశేషం. ఈ క్రమంలో అది ‘బాహుబలి: ది కంక్లూజన్’ వసూళ్లను కూడా అధిగమించింది. ‘అల వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల తర్వాతి స్థానంలో నిలిచింది.
2017 ఏప్రిల్లో రిలీజైన ‘బాహుబలి: ది కంక్లూజన్’ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్లో తొలి వారం రూ.36 లక్షల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. అది అప్పటికి ఆల్ టైం రికార్డు. ఈ రికార్డును గత ఏడాది సంక్రాంతి సినిమాలు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు అధిగమించాయి. అల వైకుంఠపురములో రూ.40.83 లక్షల గ్రాస్‌లో అగ్ర స్థానాన్ని సొంతం చేసుకుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ దానికి చేరువగా వచ్చింది. ఆ చిత్రం రూ.40.76 లక్షలు కొల్లగొట్టింది. ఇప్పుడు దేవి థియేటర్లో ఆడుతున్న ‘జాతిరత్నాలు’ తొలి వారం రోజుల్లో రూ.38.63 లక్షల గ్రాస్‌తో మూడో స్థానానికి చేరుకుంది. ‘బాహుబలి’ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. ఐదో స్థానంలో ‘మహర్షి’ చిత్రం ఉంది. ఆ సినిమా రూ.32 లక్షలు కలెక్ట్ చేసింది.
ఐతే ‘బాహుబలి-2’తో పోలిస్తే టాప్-5లో అన్ని సినిమాలకూ టికెట్ల రేట్లు పెరిగాయి. 50 శాతం ధరలు పెంచుకోవడంతో వీటి గ్రాస్ పెరిగింది. కాబట్టి నిజంగా చూస్తే ‘బాహుబలి-2’ను ఈ సినిమాలేవీ కొట్టినట్లు కాదు. ఐతే టాప్-5లో ఉన్న మిగతా చిత్రాలన్నీ పెద్ద పెద్ద హీరోలు నటించినవి. భారీ స్థాయివి. కానీ ‘జాతిరత్నాలు’ లాంటి చిన్న సినిమా వాటికి దీటుగా వసూళ్లు రాబట్టి టాప్-5లో నిలవడం అంటే మామూలు విషయం కాదు. ఆ రకంగా ‘జాతిరత్నాలు’ గ్రేట్ ఫీట్ సాధించినట్లే.
This post was last modified on March 18, 2021 3:20 pm
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…