Movie News

‘జాతిరత్నాలు’ ఎంత కొల్లగొట్టారంటే..?

జాతిరత్నాలు.. జాతిరత్నాలు.. ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లాంటి చిన్న స్థాయి నటులను పెట్టి ‘పిట్టగోడ’ లాంటి ఫ్లాప్ సినిమా తీసిన అనుదీప్ కేవీ రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు రేపుతోంది. రిలీజ్ ముంగిట అనూహ్యమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రానికి మంచి టాక్ కూడా రావడంతో వీకెండ్లో దున్నేసుకుంది.

తొలి రోజే వరల్డ్ వైడ్ దాదాపు ఐదు కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించిన ఈ చిన్న సినిమా.. ఆ తర్వాత మూడు రోజుల్లోనూ ఏమాత్రం తగ్గలేదు. ప్రతి రోజు అటు ఇటుగా రూ.5 కోట్ల మేర షేర్ రాబట్టింది. వీకెండ్ అయ్యేసరికి రూ.20 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ షేర్‌తో అబ్బురపరిచింది. ఈ సినిమా స్థాయికి నాలుగు రోజుల్లో రూ.20 కోట్ల షేర్ అంటే అసాధారణ విషయమే.

రవితేజ, నాని, రామ్, నాగచైతన్య, విజయ్ దేవరకొండ లాంటి మీడియం రేంజ్ స్టార్ల సినిమాలకు మంచి టాక్ వస్తే తప్ప ఈ స్థాయి వసూళ్లు రావు. ‘జాతిరత్నాలు’ వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు రూ.11 కోట్లు పలికాయి. అదే చాలా ఎక్కువ రేటు అనుకున్నారు. కానీ మూడో రోజుకే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయి, లాభాల బాట పట్టింది. ఆదివారం భారీ వసూళ్లతో బయ్యర్లకు లాభాలు పంచింది. ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమా ఏడున్నర కోట్ల దాకా షేర్ రాబట్టడం విశేషం.

ఏపీలో సైతం ఈ చిత్రానికి అనూహ్యమైన వసూళ్లు వస్తున్నాయి. ఓవర్సీస్‌లో అయితే స్తబ్దుగా ఉన్న మార్కెట్‌కు మంచి జోష్ ఇచ్చింది ‘జాతిరత్నాలు’. వీకెండ్లో ఏకంగా 7 లక్షల డాలర్లకు పైగా కొల్లగొట్టి పోస్ట్ కరోనా ఎరాలో తొలి మిలియన్ డాలర్ ఇండియన్ మూవీ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. వీకెండ్ తర్వాత కూడా ‘జాతిరత్నాలు’కు మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తుండటం విశేషం.

This post was last modified on March 15, 2021 10:05 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

2 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

3 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

4 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

11 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

12 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

13 hours ago