Movie News

సాయిప‌ల్ల‌వా మ‌జాకా

అప్పుడ‌ప్పుడూ కొన్ని పాట‌ల‌కు అనూహ్య‌మైన క్రేజ్ వ‌స్తుంటుంది. అవి అంచ‌నాల‌ను మించి హిట్ట‌యిపోతుంటాయి. సోష‌ల్ మీడియాను హోరెత్తించేస్తుంటాయి. ఐతే పాట బ‌య‌టికి వ‌చ్చాక జ‌నాలు విని మెచ్చాక అవి హిట్ట‌వుతుంటాయి. కానీ ఒక పాట విడుద‌ల కావ‌డానికి ముందే అది సంచ‌ల‌నం రేపుతుంద‌న్న అంచ‌నాలు క‌ల‌గ‌డం.. ఆ సాంగ్ ఇలా రిలీజ‌యిందో లేదో.. అన్ని సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో మోత మోగిపోవ‌డం.. రికార్డుల మోత మోగిస్తూ దూసుకెళ్ల‌డం అరుదైన విష‌య‌మే.

ల‌వ్ స్టోరి సినిమాలోని సారంగ ద‌రియా పాట విష‌యంలో ఇదే జ‌రిగింది. ఈ పాట‌ను రిలీజ్ చేయ‌డానికి ముందే సాంగ్ ఆఫ్ ద ఇయ‌ర్ అంటూ చిత్ర బృందం ప్ర‌మోష‌న్ మొద‌లుపెట్టింది. సాయిప‌ల్ల‌వి ముఖ‌చిత్రంతో ఆ పాట పోస్ట‌ర్ వ‌దిలిన‌పుడే ఇది వ‌చ్చిండే మెల్ల మెల్ల‌గ వ‌చ్చిండే త‌ర‌హాలో పెద్ద హిట్ట‌వుతుంద‌న్న అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సాయిప‌ల్ల‌వి ఈ పాట‌లో మెస్మ‌రైజ్ చేస్తుంద‌నే అభిప్రాయం క‌లిగింది.

ఇక పాట రిలీజ‌య్యాక ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. త‌న‌పై పెట్టుకున్న అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని రీతిలో సాయిప‌ల్ల‌వి త‌న‌దైన హావ‌భావాల‌తో, అదిరిపోయే స్టెప్లుల‌తో వారెవా అనిపించింది. దీంతో సారంగ ద‌రియా పాట‌కు యూట్యూబ్‌లో ఎదురే ఉండట్లేదు. మిలియ‌న్లకు మిలియ‌న్లు వ్యూస్‌, ల‌క్ష‌ల్లో లైక్స్‌తో దూసుకెళ్లిపోతోంది. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌, బుట్ట‌బొమ్మా లాంటి పాట‌ల రికార్డుల‌ను ఇది బ‌ద్ద‌లు కొట్టేసింది.

టాలీవుడ్లో అత్యంత వేగంగా 50 మిలియ‌న్ వ్యూస్ తెచ్చుకున్న పాట‌గా సారంగ ద‌రియా నిలిచింది. ఫిబ్ర‌వ‌రి 28న రిలీజైన ఈ పాట‌.. 15 రోజుల్లోనే ఈ మైలురాయిని చేరుకోవ‌డం విశేషం. ఈ పాట 100 మిలియ‌న్ వ్యూస్ తెచ్చుకోవ‌డం కూడా లాంఛ‌న‌మే. అది కూడా ఫాస్టెస్ట్ రికార్డే అవ్వ‌డానికి పుష్క‌లంగా అవ‌కాశాలున్నాయి. ఏప్రిల్ 16న ఈ సినిమా రిలీజ‌య్యాక ఈ పాట రీచ్ ఇంకా పెరుగుతుంద‌నే అంచ‌నాలున్నాయి.

This post was last modified on March 15, 2021 8:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు మార్కు చొరవ ఎవ్వరికీ సాధ్యం కాదంతే!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…

5 hours ago

డాల్బీ థియేటర్లు వస్తున్నాయ్….హైదరాబాద్ కూడా

మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…

6 hours ago

మిరాయ్ మెరుపుల్లో దగ్గుబాటి రానా

హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

7 hours ago

పాస్టర్ ప్రవీణ్.. ఇంకో కీలక వీడియో బయటికి

క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…

7 hours ago

కన్నప్ప ప్రీమియర్ వెనుక కహానీ ఏంటంటే

నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…

8 hours ago

ఏపీపై అమిత్ షా ఫోకస్ పెరిగినట్టే

వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…

8 hours ago