ఈయన్ని విక్టరీ మధుసూధన రావు అనేవాళ్ళు.. ఎక్కువ శాతం హిట్స్ తీసిన దర్శకుడు.. రీమేక్స్ తీయడం లో ఈయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది.. ఒరిజినల్ ని చెడగొట్టకుండా తెలుగు నేటివిటీ ని వదలకుండా హిట్ సినిమాలు తీసిన దర్శకుడాయన.. జగపతి బ్యానర్ లో ఎక్కువ సినిమాలు చేశారు..
“జగన్నాథరదచక్రాలు” అనే సినిమా కి నేను నాలుగోవ అసిస్టెంట్ గా పనిచేసాను.. మొదటి షూటింగే ఇందిరా పార్క్ లో కృష్ణ జయప్రదల మీద సాంగ్.. తార మాష్టర్ కొరియోగ్రాఫర్.. జనాన్ని కంట్రోల్ చెయ్యడానికి నలుగురు పోలీసుల్ని పెట్టాం.. కానీ లోయర్ ట్యాంక్ బండ్ వైపు నుండి దూకి కొందరు కుర్రాళ్ళు షూటింగ్ వైపు వస్తున్నారు.. నేను స్టిల్ కెమేరామ్యాన్ తులసి వెళ్లి వాళ్ళను రాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నాం.. ఇంతలో డైరక్టర్ గారు అటువైపు చుస్తే చాలామంది కుర్రాళ్ళు గోడదూకి వస్తున్నట్టు కనబడింది.. అంతే.. పరిగెత్తుకుంటూ అటువైపు వస్తున్నారు.. దారిలో ఒక చిన్న కర్రపుల్ల దొరికింది.. అది తీసుకుని జనం వైపు వచ్చారు.. అటు తెరిగి జనాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్న నన్ను ఆ కర్రపుల్ల తో రెండు పీకారు.. ఈ లోగా స్టిల్స్ తులసి పరిగెత్తుకుంటూ వచ్చి “సార్ సార్ ” అంటున్నాడు.. ఏంటి అని కోపంగా అతనిని గదమాయించాడు.” సార్.. అతను మన అసిస్టెంట్ డైరక్టర్ అండీ” అన్నాడు.. అయితే మాత్రం మేనేజర్లను పిలిచి జనాన్ని కంట్రోల్ చేయించాలి గాని మీరిద్దరే కంట్రోల్ చేస్తారా అని కోప్పడ్డాడు.. నన్ను ఆయన ఫోర్త్ అసిస్టెంట్ అని పిలిచేవాడు..
ఆలా ఆ షెడ్యూల్ ఫినిష్ అయ్యి మద్రాస్ షిఫ్ట్ అయ్యాం..మద్రాస్ లో వాహిని స్టూడియో లో 9th ఫ్లోర్ లో షూటింగ్.. సదాశివరావు కో డైరక్టర్.. ఆయన కోపం గురించి తెలుసు కాబట్టీ డైలాగ్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటే ముందే ఆఫీస్ కి పిలిపించి ఆ డైలాగ్ అతను చెప్పగలడు అనే కాన్ఫిడెన్స్ కలిగాకనే ఓకే చేసేవాళ్ళం..
ఆలా ఒక ఆర్టిస్ట్ ని ఒకే చేసి షూటింగ్ కి తీసుకెళ్లాం.. డైలాగ్ ఇచ్చాడు సదాశివరావు.. చాలా బాగా ఎక్సప్రెషన్ తో చెప్పాడు.. బ్రేక్ ఫాస్ట్ చేసి తన షాట్ కోసం ఫ్లోర్ బయట వైట్ చేస్తున్నాడు.. అప్పటికే తనకిచ్చిన డైలాగ్ ని ఉతికి ఆరేసాడు.. 11.30 కి ఫ్లోర్ లోకి వెళ్ళాడు.. అప్పుడే డైరక్టర్ గారు ఒక ఆర్టిస్ట్ ని తిడుతున్నారు.. ఆమాత్రం యాక్టింగ్ రాకుండా ఎందుకు వస్తారు.. డైలాగ్ వస్తే ఎక్సప్రెస్షన్ ఉండదు.. ఎక్సప్రెషన్ పుంటే డైలాగ్ రాదు.. అని.. మనవాడికి కంగారు మొదలైంది.. వెంటనే తనకిచ్చిన డైలాగ్ ని మననం చేసుకున్నాడు.. అక్కడున్న చెట్ల వైపు తిరిగి ఫుల్ ఎక్సప్రెషన్ తో చెప్పాడు.. ఓకే.. కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యాడు.. ఇంకో గంట గడిచింది.. బ్రేక్ ఇచ్చారు.. అందరితోపాటు తాను భోజనం చేసాడు.. రెండున్నర కి మళ్ళీ షూట్ మొదలైంది.. మూడున్నరకి మళ్ళీ సెట్ లోపలికి వెళ్ళాడు.. ఈసారి డైరక్టర్ గారు ఇంకో ఆర్టిస్ట్ ని మందలిస్తూ.. సదాశివరావు తో.. “అందుకే నేను చెబుతాను డైలాగ్ చెప్పగలిగే వాడిని మాత్రమే తీసుకురండి.. ఇతని కారణంగా మనకెంత టైం వెస్ట్.. నిర్మాతకి ఎంత నష్టం”… అని.. మనవాడికి మళ్ళీ టెన్షన్.. బయటకొచ్చి డైలాగ్ తనలో తాను చెప్పుకున్నాడు.. అయినా ఎందుకో ఆదుర్దా.. అప్పుడే బయటకొచ్చిన అసిస్టెంట్ డైరక్టర్ దగ్గర ఒక పేపర్ తీసుకుని తన డైలాగ్ చెప్పించుకుని రాసుకున్నాడు.. ఆ అసిస్టెంట్ డైరక్టర్ “ఎందుకు నువ్ బాగా చెబుతున్నావ్ గా” అంటున్న వినిపించుకోకుండా.. ఎగ్జామ్స్ లో స్టూడెంట్స్ బిట్స్ రాసుకున్నట్టు రాసుకుని జేబులో పెట్టుకున్నాడు.. మొత్తం మీద మెయిన్ ఆర్టిస్ట్ లు అందరూ వెళ్ళాక లోపలికి పిలిచారు.. “డైలాగ్ చెబుతాడా.. ఇంతకుముందు ఎక్కడైనా చేశాడా”అని సదా ని అడిగాడు.. “చేసాడు సార్.. బాగా చెపుతున్నాడు.. పొద్దున్న మనవాళ్లంతా విన్నారు కూడా” అన్నాడు సదా
.. సరే.. ఒక మానిటర్ చూద్దాం అని.. యాక్షన్ అన్నారు.. బాగానే చెప్పాడు..” ఓకే.. కొంచం కాన్ఫిడెంట్ గా చెప్పు “.. అని క్లాప్ ఇన్.. స్టార్ట్ సౌండ్.. యాక్షన్.. అన్నారు.. క్లాప్ కొట్టెలోపలే క్లాప్ ని పక్కకు నెట్టి “ఫస్ట్ వాక్యం ఏంటి సార్”అన్నాడు.. డైరక్టర్ విసుక్కున్నాడు.. తరవాత 6వ టేక్ ఓకే అయ్యింది.. ఇలా చెప్పేవాడిని వంట కట్టిన కోడి అనేవాడిని.. అదేమిటంటె.. కోడి పొదుగుతున్నప్పుడు దాని సోమరితనం మాన్పించటానికి దాని మెడలో పిడక లేదా వంట.. దానికి చిన్న రంద్రం చేసి బలవంతంగా కోడి మెడలో తగిలిస్తారు.. ఆ కోడి వంటను వదిలించునే ప్రయత్నం లో స్పీడ్ గా ముందుకు వెళ్లి వంటను వదిలి తను మాత్రం రావాలని స్పీడ్ గా వెనక్కి వస్తుంది.. పొద్దున్నే డైలాగ్ తీసుకున్న ఆర్టిస్ట్ కూడా ఇలా వంటకట్టిన కోడిలా సెట్ లోకి బయటకు తిరిగేవాడు.. ఒకసారి హీరో శోభన్ బాబు కూడా మధుసూధన రావు గారి షూటింగ్ అంటే ప్రతిరోజూ ఫస్ట్ డే షూట్ లాగే ఫీల్ అవుతాను అని చెప్పారు.. అదీ మధుసూధనరావు గారి కోపం.
— శివ నాగేశ్వర రావు
This post was last modified on March 14, 2021 2:25 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…