కొత్త సినిమాల రిలీజ్, షూటింగ్ ముచ్చట్లు ఏమీ లేని ఈ టైంలో సినీ ప్రియులకు ట్విట్టర్లో కాలక్షేపానికి ఎంచుకుంటున్న ఓ మార్గం.. పాత సినిమాల వార్షికోత్సవాల్ని పురస్కరించుకుని ట్వీట్లు వేయడం, ట్రెండ్స్‌లో పాల్గొనడం, అప్పటి జ్ఞాపకాల్ని నెమరు వేసుకోవడం. మరీ ఖాళీగా ఉండేసరికి మామూలు సినిమాలకు కూడా వార్షికోత్సవాల పేరుతో హంగామా చేస్తున్నారు.
ఐతే ఇప్పుడు ఓ రెండు ఆల్ టైం హిట్ సినిమాల వార్షికోత్సవాలకు వేళైంది. ఆ రెండూ తెలుగు సినిమా చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయిన.. ట్రెండ్ సెట్ చేసిన సినిమాలే. ఒకటి మెగాస్టార్ చిరంజీవి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి కాగా.. ఇంకోటి విక్టరీ వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాం రా. ఈ రెండు చిత్రాలూ మే 9నే రిలీజయ్యాయి.
జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజై 30 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కొన్ని రోజుల కిందటి నుంచే సోషల్ మీడియాలో హంగామా నడుస్తోంది. ఈ సినిమాను నిర్మించిన వైజయంతీ మూవీస్ సంస్థ పాత జ్ఞాపకాలతో వీడియోలు కూడా రిలీజ్ చేస్తోంది. నాని వాయిస్ ఓవర్‌తో ఇప్పటికే రెండు వీడియోలొచ్చాయి. అసలే చిరంజీవి సినిమా.. పైగా ఆల్ టైం హిట్లలో ఒకటి. ఇక మెగా అభిమానుల సందడి గురించి చెప్పేదేముంది. ముందు రోజే *30 గ్లోరియస్ ఇయర్స్ ఫర్ ఇండస్ట్రీ హిట్ జేవీఏఎస్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్లు గుప్పిస్తున్నారు.
వీరికి విక్టరీ ఫ్యాన్స్ కూడా తోడయ్యారు. వెంకీ కెరీర్లో ఒకానొక బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ప్రేమించుకుందాం రా విడుదలై శనివారానికి 23 ఏళ్లు పూర్తవుతున్నాయి. దీంతో ఆ సినిమా జ్ఞాపకాలు, దాని ప్రభంజనాన్ని గుర్తు చేసుకుంటూ వెంకీ అభిమానులు ట్విట్టర్లో సందడి చేస్తున్నారు. శనివారం ఈ రెండు సినిమాల హంగామా మరో స్థాయికి చేరే అవకాశముంది.
This post was last modified on May 9, 2020 5:28 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…