Movie News

క్రిష్.. అలా మాత్రం చేయొద్దు

‘హరి హర వీరమల్లు’ ఫస్ట్ గ్లింప్స్‌తో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు క్రిష్. ‘యన్.టి.ఆర్’ డిజాస్టర్ అయ్యాక క్రిష్ మీద జనాలకు నమ్మకాలు తగ్గిపోయాయి. పవన్‌తో సినిమా అన్నా కూడా పెద్దగా ఎగ్జైట్మెంట్ కనిపించలేదు. ఈ సినిమాపై చాలా తక్కువ అంచనాలే పెట్టుకున్నారు. కానీ ఫస్ట్ గ్లింప్స్ చూస్తే మాత్రం ‘ఎపిక్ ఇన్ మేకింగ్’ అనిపించింది. పవన్ నుంచి అభిమానులు కోరుకునే భారీ చిత్రం లాగే అనిపిస్తోంది ‘హరి హర వీరమల్లు’. టాలీవుడ్లో ప్రతి స్టార్ కూడా ఇలాంటి జానర్లో ఓ సినిమా చేయాలనుకుంటాడు. ప్రేక్షకులు ఊహించిన దాని కంటే ఎక్కువ భారీతనమే ఈ సినిమాలో ఉంటుందని ఫస్ట్ గ్లింప్స్ బ్యాక్ డ్రాప్ చూస్తే అర్థమైంది. రెండు మూడు దశాబ్దాల కిందటి వాతావరణాన్ని తెరపైకి తీసుకొచ్చిన విధానం.. ఆ ఓడలు, ఆ సెట్లు, మిగతా సెటప్ అంతా కూడా సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో చాటి చెప్పాయి. ఫేమస్ ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ ఈ చిత్రానికి పని చేయడం గమనార్హం.

ఐతే ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచడంతో పాటు కొన్ని సందేహాలు కూడా రేకెత్తించింది. ఇంతకుముందు క్రిష్ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ లాంటి భారీ చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా తీశాడు. చాలా తక్కువ రోజుల్లో అంత భారీ చిత్రాన్ని తీర్చిదిద్ది ఔరా అనిపించాడు. విడుదల ముంగిట ఆ సినిమా గురించి పెద్ద చర్చే నడిచింది. కానీ రిలీజయ్యాక ఆ సినిమా అనుకున్నంతగా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించలేకపోయింది. ‘బాహుబలి’లా గుర్తుండిపోవాల్సిన సినిమా.. అలా మరుగున పడిపోవడానికి క్రిష్ సినిమా మధ్యలో కాడి వదిలేయడమే కారణం. ఒక దశ వరకు హీరోకు ఒక రేంజిలో ఎలివేషన్ ఇచ్చి మాస్ ప్రేక్షకులను సైతం మెప్పించిన క్రిష్.. ఆ తర్వాత దాని స్థాయిని తగ్గించేశాడు. చివరికి వచ్చేసరికి మొక్కుబడిగా సినిమాను ముగించిన భావన కలిగింది. రాజమౌళిలో అదిరిపోయే ఫినిషింగ్ టచ్ ఇవ్వడంలో, సినిమా గ్రాఫ్ పెంచడంలో అతను విఫలమయ్యాడు. ‘హరి హర వీరమల్లు’ విషయంలో క్రిష్ అలా చేయొద్దని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. చివరి వరకు ఒకే స్టాండర్డ్ మెయింటైన్ చేయాలని, మాస్‌ను మెప్పించే ముగింపునిచ్చి ‘హరిహర వీరమల్లు’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యేలా చూడాలని వారు ఆశిస్తన్నారు.

This post was last modified on March 12, 2021 10:47 pm

Share

Recent Posts

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

6 minutes ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

31 minutes ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

60 minutes ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

2 hours ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

2 hours ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago