లాక్‌డౌన్ కారణంగా అన్ని భాషల్లోనూ సినిమా షూటింగ్‌లన్నింటికీ బ్రేక్ పడింది. షూటింగ్ పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసుకున్న చాలా సినిమాలు, రిలీజ్ డేట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. అయితే ఈ టైమ్‌లో తన కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసి, అందర్నీ ఆశ్చర్యంలో పడేశాడో యంగ్ హీరో.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కొత్త సినిమాను ప్రకటించాడంటే… మనోడు వరుస హిట్టుల్లో దూసుకుపోతూ సక్సెస్‌లో ఉన్నవాడేం కాదు, ఒకదాని తర్వాత మరొటి ఇలా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఇలాంటి టఫ్ టైమ్‌లో కూడా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం వెనక ఓ పర్ఫెక్ట్ ప్లాన్ ఉందంటున్నారు టాలీవుడ్ జనాలు.
ఓ పేరున్న సినిమా వ్యక్తి బ్యాకింగ్ తో సినిమాల్లోకి వచ్చిన సదరు హీరో, తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు తీస్తున్నాడు. ఎంతో కష్టపడితే ఈ కుర్రాడికి ఏడేళ్ల కిందట ఓ సక్సెస్ దక్కింది. తన కెరీర్‌కు ఊపునిచ్చిన ఆ సినిమా పేరుకు దగ్గరగా ఉండే టైటిల్‌తో కొత్త ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాడు ఈ యంగ్ హీరో.
తమిళ్‌లో హిట్టైన ఓ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహారిస్తున్న యంగ్ హీరోకి ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయి. దాంతో ఏం చేయాలో తెలియక సడెన్‌గా మరో కొత్త సినిమాను మొదలెట్టాడు. ప్రముఖ బ్యానర్‌లో రూపొందే ఈ సినిమా ద్వారా హీరోగారికి వచ్చే పారితోషకాన్ని తన సొంత ప్రాజెక్ట్‌కు ఉపయోగించబోతున్నాడట. నిజానికి ఇది చాలా పాత లాజిక్కే కాని, ఈ మద్య ఎవరూ ఇలాంటి చేయట్లేదు. బట్, మనోడికి తప్పట్లేదు.
ఏదేమైనా కూడా అదిరిపోయే ఐడియాతో రెండు సినిమాలను లైన్‌లో పెట్టిన ఈ యంగ్ హీరో ఈసారైనా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.
This post was last modified on May 11, 2020 10:47 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…