సంతోష్ శోభన్.. ‘గోల్కొండ హైస్కూల్’ సినిమాలో స్కూల్ టీం కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు సంపాదించిన కుర్రాడు. ‘వర్షం’ దర్శకుడు శోభన్ కొడుకు ఇతనన్న విషయం చాలా మందికి తెలియదు. తండ్రి మంచి స్థాయిలో ఉండగానే తెరంగేట్రం చేసి నిలదొక్కుకోవాలని యువ కథానాయకులు చూస్తారు కానీ.. సంతోష్‌కు ఆ అవకాశం లేకపోయింది. తండ్రి బతికుండగా అతను చిన్న కుర్రాడు.
ఐతే ఇండస్ట్రీలో శోభన్‌కు మంచి పేరుండటంతో ఆయన లేకపోయినా.. కొడుక్కి మంచి ప్రోత్సాహమే లభించింది. అతడిలో మంచి ప్రతిభ ఉందని తొలి సినిమాతోనే రుజువైంది. ఆపై సంతోష్ హీరోగా మారి ‘తను నేను’, ‘పేపర్ బాయ్’ లాంటి సినిమాలు చేశాడు. కానీ అవి అతడికి సరైన కార్తీక్ రాపోలు అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు.
‘డజ్ సైజ్ మేటర్స్’ అంటూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్‌తో ఈ సినిమాను పరిచయం చేశారు. ఇప్పుడు మరో ఆసక్తికర వీడియోతో సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. ఇందులో సంతోష్ తన మీద తనే సెటైర్లు వేసుకోవడం విశేషం. ఈ వీడియోలో సంతోష్‌తో పాటు కమెడియన్ సుదర్శన్ కనిపించారు. టీ కొట్టు ముందు పేపర్ చదువుతున్న సంతోష్‌ను చూసి నిన్నెక్కడో చూసినట్లుందే అని అడగడం, తర్వాత ‘ఏక్ మిని కథ’ పోస్టర్‌ను గుర్తు తెచ్చుకోవడం.. ఆపై ఇంతకీ ఆ సినిమాలో హీరో ఎవరని అడగడం.. ఇంతకుముందే ఓ సినిమాలో చేశావ్ కదా అంటూ ‘పేపర్ బాయ్’ కాకుండా ఆఫీస్ బాయ్, స్మార్ట్ బాయ్ అంటూ ఏవేవో పేర్లు చెప్పడం భలే సరదాగా అనిపిస్తోంది.
సుదర్శన్ మాటలకు సంతోష్ ఇచ్చిన హావభావాలు అతడి టాలెంట్ ఏంటో చూపించాయి. రొటీన్‌కు భిన్నంగా ఉన్న ఈ వీడియోనే ప్రి టీజర్‌గా వదిలారు. త్వరలోనే ‘ఏక్ మిని కథ’ టీజర్ రాబోతోంది. దాంతో ఏమేర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తారో చూడాలి.
This post was last modified on March 11, 2021 9:55 am
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్‌సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…