ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది ‘ఆర్ఆర్ఆర్’ సినిమా. 2020 జులై 30న రావాల్సిన సినిమాను.. ఆ సమయానికి రెడీ చేయలేమని 2021 జనవరి 8కి వాయిదా వేయించాడు దర్శకుడు రాజమౌళి. ఆ దిశగా ప్రణాళికలతో వెళ్తుండగా.. కరోనా వచ్చి అంతా నాశనం చేసేసింది. కరోనా బ్రేక్ తర్వాత షూటింగ్ పున:ప్రారంభించిన కొన్ని నెలలకు అన్ని విషయాలూ చూసుకుని దసరా కానుకగా అక్టోబరు 13న ఈ చిత్రానికి విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ డేట్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా రావాల్సిందే అని, మార్చేందుకు అవకాశమే లేదని అంతా అనుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ తేదీని అందుకోవడంపై చిత్ర బృందంలో సందేహాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం.
ముందు అనుకున్న ప్రకారం అయితే ఈపాటికి షూటింగ్ దాదాపు పూర్తయి ఉండాలి. కానీ రాజమౌళి తనదైన చెక్కుడు చెక్కుతూ వెళ్తుండటం, కొన్ని షెడ్యూళ్లు అనుకున్న ప్రకారం ముగియకపోవడం, చరణ్ ‘ఆచార్య’ కోసం బ్రేక్ తీసుకోవడం వల్ల షూటింగ్ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఇంకా నెలా నెలన్నర దాకా షూట్ కోసం కేటాయించాల్సి ఉందట. ఆ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ పని ఉంది. ఇతర పోస్ట్ ప్రొడక్షన్.. వివిధ భాషల్లో డబ్బింగ్ పనులన్నీ ముగించి అక్టోబరుకు సినిమాను రెడీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డెడ్ లైన్ అందుకోవడానికి ముందు గట్టిగా ప్రయత్నించి, కుదరని పక్షంలో వాయిదా వేద్దామని చూస్తున్నారట. మరి కొన్ని రోజుల తర్వాత ఈ విషయమై ఒక క్లారిటీ వస్తుందని, దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందామని చూస్తున్నారట. దసరా మిస్ అయిందంటే ఇక వచ్చే సంక్రాంతికే ఈ సినిమాను రిలీజ్ చేయాల్సి ఉంటుంది. మరీ 2022 వేసవి దాకా అయితే ఎదురు చూడలేరు. ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతిని టార్గెట్ చేసేట్లయితే మహేష్ మూవీ ‘సర్కారు వారి పాట’ దసరాకు ప్రి పోన్ చేయొచ్చని అంటున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ దసరాకు ఫిక్సవడంతోనే ఈ చిత్రాన్ని సంక్రాంతికి షెడ్యూల్ చేశారు. ఈ సినిమా షూటింగ్ జోరుగానే సాగుతుండటంతో దసరాకు సిద్ధం చేయడం కష్టమేమీ కాదనుకుంటున్నారు. మరి పవన్-క్రిష్ సినిమా పరిస్థితేంటో చూడాలి. ‘ఆర్ఆర్ఆర్’తో అది కూడా పోటీ పడకపోవచ్చు. దీపావళి లేదా క్రిస్మస్ సీజన్‌కు దాన్ని ప్రిపోన్ చేసే అవకాశాలున్నాయి.
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…