Movie News

మహేష్, బాలయ్య సినిమాలపై రావిపూడి క్లారిటీ

గత కొన్నేళ్లలో టాలీవుడ్లో చాలా వేగంగా పెద్ద రేంజికి వెళ్లిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకడు. నందమూరి కళ్యాణ్ రామ్‌తో ‘పటాస్’ లాంటి మీడియం రేంజ్ సినిమాతో మొదలుపెట్టిన అతను.. వరుసగా హిట్లు ఇస్తూ ఐదో సినిమాకే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌తో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. మహేష్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ‘సర్కారు వారి పాట’తో ఆయన కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ డెలివర్ చేశాడు అనిల్.

దీంతో అతడితో మరో సినిమా చేయడానికి ఇంతకుముందే మహేష్ హామీ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. కాగా ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’లో నటిస్తున్న మహేష్.. దీని తర్వాత రాజమౌళితో సినిమాను మొదలుపెట్టడానికి సమయం పడుతుంది కాబట్టి, మధ్యలో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. ఆ ఖాళీని అనిలే భర్తీ చేయబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే నందమూరి బాలకృష్ణతోనూ అనిల్ ఓ సినిమా చేయొచ్చనే ప్రచారమూ జరుగుతోంది.

తన కథతో, తన దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ‘గాలి సంపత్’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన అనిల్.. పై రెండు సినిమాల గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ రెండు సినిమాలు లైన్లోనే ఉన్నట్లు అతను స్పష్టం చేశాడు. ఐతే ప్రస్తుతం ఆ ప్రాజెక్టులు చర్చల దశలోనే ఉన్నాయని, ఏదీ ఖరారవ్వలేదని చెప్పాడు. ఆ హీరోలిద్దరితో సినిమాల కోసం కథల తయారీ కూడా జరుగుతున్నట్లు అతను వెల్లడించాడు. బహుశా ఆ ఇద్దరికీ అనిల్ ఇంకా స్క్రిప్టు వినిపించి ఉండకపోవచ్చు.

ఏ సినిమా ఎప్పుడు చేయాలన్న టైమింగ్ ఇంకా కుదిరి ఉండకపోవచ్చు. కానీ అనిల్‌తో పని చేయడానికి ఆ ఇద్దరు హీరోలూ ఆసక్తితోనే ఉండే అవకాశం ఉంది కాబట్టి ముందో వెనుకో ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కడం ఖాయం అనుకోవచ్చు. మహేష్ లాంటి పెద్ద స్టార్‌తో సినిమా చేసినప్పటికీ.. బాలయ్యతో ఓ చిత్రం చేయాలన్నది అనిల్ కోరిక. ఇందుకోసం గతంలోనే ప్రయత్నించాడు కానీ.. వర్కవుట్ కాలేదు.

This post was last modified on March 10, 2021 8:09 am

Share

Recent Posts

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

10 minutes ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

26 minutes ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

3 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

4 hours ago

విజయ్ చెప్పింది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా

రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…

4 hours ago

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

7 hours ago