ఒక కొత్త హీరో.. ఒక కొత్త హీరోయిన్.. ఈ ఇద్దరినీ పెట్టి సినిమా తీసినవాడూ కొత్త దర్శకుడే. అతను చేసిందేమీ యాక్షన్ మూవీ కాదు. హీరోను పెద్ద మాస్ హీరోలాగానూ ప్రెజెంట్ చేయలేదు. అయినా సరే.. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపింది. ఎవ్వరూ ఊహించని స్థాయిలో వసూళ్ల మోత మోగించింది. కనీ వినీ ఎరుగని రికార్డులు సృష్టించింది. ఈ ఉపోద్ఘాతం ‘ఉప్పెన’ సినిమా గురించే అని అర్థమయ్యే ఉంటుంది.
విడుదలైన తొలి రోజు నుంచి సంచలనాలు రేపుతూ.. కొత్త కొత్త రికార్డులు నెలకొల్పుతూ సాగుతున్న ఈ చిత్రం.. ఇప్పుడు మరో అరుదైన ఘనతను అందుకుంది. వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా వెల్లడించింది. తమ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లు వంద కోట్లను దాటాయని.. సముద్రమంత ప్రేమ చూపించినందుకు ధన్యవాదాలని ఆ సంస్థ ఈ పోస్టర్లో పేర్కొంది. హీరో వైష్ణవ్ తేజ్ రోరింగ్ లుక్‌తో కనిపించాడు ఈ పోస్టర్లో.
ఒక డెబ్యూ హీరో సినిమా నెలకొల్పిన అన్ని రికార్డులనూ తొలి మూణ్నాలుగు రోజుల్లోనే ‘ఉప్పెన’ బద్దలు కొట్టేసిన సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ లాంటి భారీ చిత్రాల స్థాయిలో వీకెండ్ తర్వాత అనూహ్యమైన షేర్ సాధిస్తూ దూసుకెళ్లిందీ చిత్రం. కొత్త సినిమాలు వస్తున్నాయి. పోతున్నాయి. కానీ ‘ఉప్పెన’ జోరు మాత్రం ఆగట్లేదు. శుక్రవారం కొత్త సినిమాల రిలీజ్‌తో కొంత జోరు తగ్గుతున్నా శని, ఆదివారాలు వచ్చేసరికి వాటిని వెనక్కి నెట్టి బాక్సాఫీస్ లీడర్‌గా నిలుస్తూ దూసుకెళ్తోందీ చిత్రం.
ఈ వారాంతంలో కూడా కొత్త సినిమాల కంటే ‘ఉప్పెన’కు ఎక్కువ షేర్ వస్తే ఆశ్చర్యమేమీ లేదు. ఇప్పటికే రూ.50 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ మార్కును ఈ చిత్రం దాటేసింది. ఇప్పుడు గ్రాస్ వసూళ్లు రూ.100 కోట్ల మార్కును అందుకున్నాయి. రొమాంటిక్ సినిమాల్లో అత్యధిక గ్రాస్, షేర్ కలెక్ట్ చేసిన ‘గీత గోవిందం’కు సమీపంగానే వెళ్లేలా కనిపిస్తోందీ చిత్రం.
This post was last modified on March 6, 2021 5:49 pm
సంక్రాంతి పండక్కి ప్రతిసారీ సినిమాను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తుంటారు దిల్ రాజు. ఒకవేళ తన ప్రొడక్షన్లో సినిమా లేకపోయినా..…
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ చివరి దశ షూటింగ్ ఆఘమేఘాల మీద జరుగుతోంది. జనవరి 12…
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…
వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…