Movie News

సమీక్ష – పవర్ ప్లే

మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాలు చేయాలునుకోవడం, ట్రెండింగ్ జోనర్ లోకి వెళ్లి తమ లక్ ట్రయ్ చేయాలనుకోవడం తప్పు కాదు. పైగా పెద్దగా ప్రత్యేకమైన ఇమేజ్ లేని దర్శకులు, హీరోలు ఇలా రకరకాలు ట్రయ్ చేయడమే మంచిది కూడా. హీరో రాజ్ తరుణ్- డైరక్టర్ కొండా విజయ్ కుమార్ లు ఇప్పుడు ఈ ప్రయత్నమే చేసారు. వారు రెగ్యులర్ గా చేస్తున్న సినిమాల నుంచి పక్కకు జరిగి, ఓ క్రైం సస్సెన్స్ థ్రిల్లర్ ను హ్యాండిల్ చేసారు. అయితే రెగ్యులర్ సినిమాల నుంచి పక్కకు జరిగి కొత్త జోనర్ లోకి వచ్చారు కానీ కొత్త లైన్ తెచ్చుకోలేకపోయారు.

ఒక యాక్సిడెంటల్ మర్టర్ ను ఓ యాక్సిడెంటల్ ఫేక్ నోట్స్ కేసును ముడిపెడుతూ కథ రాసుకున్నారు. కానీ రెండింటిని నడపడంలో కానీ, రెండింటికి మూలమైన మోటివ్ లో కానీ కొత్త దనం లేకుండా పోయింది. అదే సమయంలో కీలకమైన సస్సెన్స్ థ్రిల్లర్ లను ఎలా నడపాలో అన్న బేసిక్ ఐడియా దర్శకుడికి లోపించినట్లు అనిపించింది. అంతకు మించి కథను చెప్పడంలో కీలకమైన చోట్ల క్లారిటీ మిస్ అయింది. లాజిక్ లు అంతకన్నా మిస్ అయ్యాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే.. ఎటిఎమ్ ల్లో డబ్బులు పెట్టే వాళ్లలో ఒకడు తరచు ఆ డబ్బులు వాడుతుంటాడు. వాటిని ఓసారి అకస్మాత్తుగా వెనక్కు పెట్టాల్సి వచ్చినపుడు ఓ దాదా దగ్గర అప్పు చేస్తాడు. వాటిల్లో కొన్ని ఫేక్ నోట్లు. అవి కాస్తా అనుకోకుండా హీరోకి వస్తాయి. దాంతో హీరో మీద ఫేక్ నోట్ కేసు పడుతుంది. ఇది ఒక వ్యవహారం. ఈ ఫేక్ నోట్ లు డ్రా చేసిన ఏటిఎమ్ దగ్గరే ఓ మర్డర్ జరుగుతుంది. అదంతా అక్కడి సిసి టీవీల్లో రికార్డు అవుతుంది. ఇప్పుడు ఈ సిసి టీవీ ఫుటేజ్ బయటకు వస్తే హీరో సేఫ్. కానీ మర్డర్ చేసిన వారు ఇరుక్కుంటారు. ఇదీ లాక్.

ఫస్ట్ క్రయిమ్ వ్యవహారం క్లారిటీగా చెప్పడంలోనే దర్శకుడు తడబడ్డాడు. చెప్పాను అనిపించేసాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన హీరో బ్యాంక్ సిసి ఫుటేజ్ కోసం అంత కిందా మీదా అయిపోవడం ఎందుకో? కోర్టు ద్వారా అడిగితే అదే వస్తుంది కదా? అదే విధంగా ఏటిఎమ్ ల్లో బ్యాలెన్స్ ఎంత వుంది? అన్నది బ్యాంకుకు నేరుగా తెలుస్తూ వుంటుంది. సినిమాలో చూపించినట్లు అయితే ఎటిఎమ్ ల్లో డబ్బులు పెట్టే సిబ్బంది హ్యాపీగా ఆ డబ్బులు రొటేషన్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ లాజికల్ మిస్సింగ్ లు.

సరే తొలి క్రయిమ్ ను బయటపెట్టారు. రెండో క్రయిమ్ ను సస్సెన్స్ కోసం దాచారు. పైగా ప్రేక్షకులను కావాలని తప్పు దారి పట్టించి, అనుమానం అజయ్ మీదకు వచ్చేలా సీన్లు రాసుకున్నారు. అంతా బాగుంది. కానీ ఇన్వెస్టిగేషన్ అన్నది సీరియస్ గా జరగాలి. స్టెప్ బై స్టెప్ లోకేషన్ మారుతూ కొత్త పాత్రలు లేదా కొంత అంశాలు కలుస్తూ వెళ్లాలి. అప్పుడే ఆసక్తి వుంటుంది. కానీ ఈ సినిమాలో కథ, పరిశోధన అక్కడిక్కడే తిరుగుతూ వుంటుంది. అవే లోకేషన్లు, అవే మొహాలు. ఇక ఆసక్తి ఎక్కడి నుంచి పుట్టుకువస్తుంది. తొలిసగం మొత్తం అంతా కలిపి ఏదైనా వెబ్ సిరీస్ లో ఒక ఎపిసోడ్ ను చూసినట్లు అనిపిస్తుంది.

మలిసగంలోకి వచ్చాక, రెండో క్రయిమ్ గురించి విప్పడం ప్రారంభం అవుతుంది. ప్రిన్స్-పూర్ణల మధ్య అక్రమ సంబంధాల సీన్లు అవీ సినిమా జోనర్ ను డైల్యూట్ చేస్తాయి. అసలు అప్పటి వరకు వున్న క్రైమ్, ఇన్వెస్టిగేషన్ ను పక్కన పడేలా చేస్తాయి. ఆ తరవాత క్లయిమాక్స్ కు లీడ్ చేసే సీన్లు అన్నీ నానా గందరగోళంగా వుంటాయి.

సినిమాలో రాజ్ తరుణ్ బాగానే ఫిట్ అయ్యాడు. ఫేస్ లో మిక్స్ డ్ ఫీలింగ్స్ బాగానే పలికించాడు. హీరోయిన్ ట్రాక్ నే సరిగ్గా సెట్ కాలేదు కాబట్టి,. ఇక ఆమె గురించి, యాక్టింగ్ గురించి మాట్లాడుకోవడం అనవసరం పైగా హీరోయిన్ కు వేరే పెళ్లి చూపులు, కమెడియన్ రాజేష్ ను తీసుకువచ్చి నస పెట్టారు. పూర్ణకు మంచి పాత్ర దొరికింది బాగా చేసింది. నేపథ్య సంగీతం బాగానే సరిపోయింది. బడ్జెట్ ను గిరి గీసుకుని వున్నట్లుంది అందుకే లోకేషన్లు కూడా మార్చకుండా సినిమాను అక్కడిక్కడే తిప్పేసారు.

ఇలా మొత్తం మీద సినిమా సరైన రీతిలో సాగలేదు, సరైన ఫలితాన్ని సాధించలేదు.

ఫినిషింగ్ టచ్…పూర్ ప్లే

-సూర్య

This post was last modified on March 6, 2021 10:26 am

Share

Recent Posts

ఈ దెబ్బతో గొడ్డలి పార్టీ మూతపడాలి

స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీ క్లిన్ స్వీప్ చేయాలి. ఆ దెబ్బతో గొడ్డలి పార్టీ మూత పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు…

30 minutes ago

ఎక్కాల్సిన రైలు బాగా లేటయ్యింది

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలని పెద్దలు అంటారు. పెళ్లి, పిల్లలు ఏదైనా సరే ఏజ్ బార్…

46 minutes ago

నాన్న, అమ్మ, కొడుకు.. ఇప్పుడు కూతురు కూడా

సినిమా కుటుంబాల నుంచి వారసులు ఇండస్ట్రీలోకి రావడం చాలా మామూలు విషయం. ఐతే ఒక కుటుంబంలో తండ్రి హీరోగా, తల్లి…

2 hours ago

స్థానిక ఎన్నికలు మీ భవిష్యత్తు

గత ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను పనిచేశాను. స్థానిక ఎన్నికలు మీ భవిష్యత్తు. మీ అవసరాల కోసం. అందుకే…

6 hours ago

మోడీ ప‌ర్య‌ట‌న‌… బ్లాక్ డ్రెస్‌లో సీఎం విజ‌య్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆదివారం త‌మిళ‌నాడులో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ప్రారంభించారు. అయితే..…

11 hours ago

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

11 hours ago