ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి.. కెరీర్ ఆరంభంలో వరుసగా సూపర్ హిట్లు ఇచ్చిన నటుడు రాజ్ తరుణ్. అతడి తొలి చిత్రం ‘ఉయ్యాల జంపాల’తో పాటు.. మలి చిత్రాలు ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21 ఎఫ్’ ఎంత పెద్ద విజయం సాధించాయో తెలిసిందే. కానీ ఆ విజయాల్ని నిలబెట్టుకపోయాడు రాజ్.
హడావుడిగా ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేసి కెరీర్‌ను దెబ్బ తీసుకున్నాడు. మళ్లీ ఓ మంచి హిట్టు కొట్టి కెరీర్‌ను గాడిన పెట్టుకోవాలని చూస్తున్నాడు కానీ.. ఆ విజయమే దక్కట్లేదు. గత ఏడాది అతను నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా ఓటీటీలో రిలీజవడంతో దాని ఫలితం పై ఒక అంచనాకు రాలేని పరిస్థితి. ఆ సినిమా తీసిన విజయ్ కుమార్ కొండాతోనే ఇప్పుడు ‘పవర్ ప్లే’ అనే సినిమాలో నటించాడు. శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
ఐతే రాజ్‌కు సరైన విజయాలు లేకున్నా అవకాశాలకైతే లోటు లేదు. కొత్తగా అతను రెండు సినిమాల్లో నటిస్తుండటం విశేషం. వీటితో పాటు మరో రెండు కొత్త చిత్రాలు కూడా కమిటయ్యాడట. ఆ చిత్రాల విశేషాలను మీడియాతో పంచుకున్నాడు రాజ్. ఇంతకుముందు తనతో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా తీసిన శ్రీనివాస్ గవిరెడ్డితో రాజ్ మరోసారి జట్టు కట్టాడు. వీరి కలయికలో తెరకెక్కుతున్న సినిమా పూర్తి కావచ్చిందట. అలాగే తన తొలి చిత్ర దర్శకుడు విరించి వర్మతో మరో సినిమా చేస్తున్నానని.. అది 60 శాతం పూర్తయిందని రాజ్ వెల్లడించాడు.
ఇవి కాక శాంటో అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేయనున్నానని.. అలాగే విజయ్ కుమార్ కొండాతోనూ మరో సినిమా ఉంటుందని చెప్పాడు. హిందీలో విజయవంతం అయిన ‘డ్రీమ్ గర్ల్’ రీమేక్ కోసం తామిద్దరం మళ్లీ కలుస్తున్నట్లు అతను తెలిపాడు. హిందీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బేనర్లో ఈ సినిమా చేయనున్నట్లు రాజ్ వెల్లడించాడు.
This post was last modified on March 5, 2021 11:41 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…