బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో డిజాస్టర్. ఆ తర్వాత చేసిన రాధేశ్యామ్ మీద అంతగా అంచనాల్లేవు. దీంతో ప్రభాస్ స్టార్‌డమ్ పడిపోతోందన్న వ్యాఖ్యలు మొదలయ్యాయి. కానీ ఆ తర్వాత మూడు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్నాడు యంగ్ రెబల్ స్టార్. వీటిలో ముందుగా ప్రకటించి చివరగా మొదలు కానున్న సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోయేదే.
ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ప్రభాస్ అభిమానులను ఊరిస్తున్నాడు నాగ్ అశ్విన్. తన నిర్మాణంలో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇచ్చిన ఓ వీడియో ఇంటర్వ్యూ సందర్భంగా అశ్విన్.. ప్రభాస్‌తో తాను చేయబోయే సినిమా గురించి మాట్లాడాడు.
ఈ సినిమాలో ప్రభాస్‌ను నెవర్ బిఫోర్ లుక్‌లో చూడొచ్చని అశ్విన్ చెప్పాడు. ప్రభాస్ పోష్ లుక్‌లో కనిపిస్తాడని కూడా సంకేతాలిచ్చాడు. ప్రభాస్‌తో తాను చేయబోయే చిత్రం అంతర్జాతీయ సినిమాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ఉంటుందన్నాడు. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద తారలు నటిస్తున్నప్పటికీ.. వాళ్లను మించిన ఆకర్షణలో ఈ సినిమా కథలో ఉన్నాయని అశ్విన్ తెలిపాడు.
ఈ సినిమా షూటింగ్ మొదలు కావడంలో ఆలస్యం అవుతుండటం గురించి స్పందిస్తే.. తాము ప్రి ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ప్రభాస్ కల్పించాడని చెప్పడం విశేషం. ఈ ఏడాదే ఈ చిత్ర షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నట్లు అశ్విన్ తెలిపాడు. అశ్విన్ మామ అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ పతాకంపై దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించబోతుండటం విశేషం.
This post was last modified on March 2, 2021 10:19 am
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…