టాలీవుడ్ లేటెస్ట్ నాన్-బాహుబలి హిట్ ‘అల వైకుంఠపురములో’ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా ‘పుష్ప’. దీని కంటే ముందు నాన్-బాహుబలి హిట్‌గా ఉన్న ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ చేస్తున్న చిత్రం కూడా ఇదే. ఇక ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పేదేముంది? టైటిల్, ఫస్ట్ లుక్‌తోనే సుకుమార్ ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెంచేశాడు. ఈ మధ్యే వచ్చిన రిలీజ్ డేట్ పోస్టర్ సైతం ఆసక్తిని ఇంకా పెంచింది. ఇక ఈ సినిమా టీజర్ ఎప్పుడు వస్తుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు బన్నీ-సుకుమార్ అభిమానులు.
ఐతే దానికి ముహూర్తం ఖరారైనట్లు తాజా సమాచారం. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ‘పుష్ప’ టీజర్ రిలీజ్ చేయాలని చిత్ర బృందం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసిందట. ఆగస్టు 13న సినిమా రిలీజ్ కావాల్సి ఉంది కాబట్టి బన్నీ పుట్టిన రోజుకు టీజర్ రిలీజ్ చేయడానికి పర్ఫెక్ట్ టైమింగ్ అని భావిస్తున్నారట.
ప్రస్తుతానికి టీజర్ ఎలా ఉండాలనే విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. ముహూర్తం మాత్రం ఖరారైంది. దానికి సంబంధించిన పని త్వరలో మొదలవుతుంది. ప్రస్తుతం సుకుమార్ తన కెరీర్లోనే అత్యంత వేగంగా ‘పుష్ప’ షూట్ సాగిస్తన్నట్లు సమాచారం. ఆగస్టు 13కు సినిమా ఫిక్స్ చేయడంతో సుకుమార్ తీవ్ర ఒత్తిడిలో పడ్డాడు. ఒకప్పట్లా మరీ సాగదీయకుండా సినిమాను చకచకా లాగించేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే రంపచోడవరంలో రెండు షెడ్యూళ్లు జరిగాయి. హైదరాబాద్‌లోనూ ఓ షెడ్యూల్ చేశారు. దాదాపు సగం సినిమా పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్ర బృందం తమిళనాడులోని టెన్‌కాశిలో కొత్త షెడ్యూల్ చిత్రీకరణలో బిజీగా ఉంది. సుకుమార్ ఆ షెడ్యూల్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని తన కూతురి శారీ ఫంక్షన్లో పాల్గొని వెళ్లాడు. అక్కడి ఓ పల్లెటూరిలో హీరో కుటుంబానికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది.
This post was last modified on March 1, 2021 11:03 am
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…