లాక్ డౌన్ టైంలో ఓటిటీ సుబ్స్క్రైబర్స్ బాగా పెరిగారు. ముఖ్యంగా ఫామిలీ ఆడియన్స్ ఇప్పుడు వెబ్ సిరీస్ కి కూడా అలవాటు పడ్డారు. మారిన ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తెలుగు సినిమా నిర్మాతలు కూడా ఇకపై వెబ్ కంటెంట్ పై దృష్టి పెట్టాలని డిసైడ్ అయ్యారు. వెబ్ సిరీస్ అంటే ప్రస్తుతానికి స్టార్స్ లేకుండా చిన్నవాళ్లతోనే రూపొందుతున్నాయి.
అందుకే సురేష్ బాబు లాంటి నిర్మాతలు స్కేల్ పెంచడంపై ఫోకస్ చేస్తున్నారు. బాలీవుడ్ లో సైఫ్ అలీ ఖాన్ రేంజ్ వరకే ఇలాంటివి ట్రై చేస్తున్నారు కానీ ప్రముఖ నటులు ఇంకా ఇటు రాలేదు. కానీ హాలీవుడ్ లో అలా లేదు. ఎవరైనా ఏదైనా చేసేయడానికి సిద్ధంగా ఉంటారు.
అందుకే తెలుగు వెబ్ సిరీస్ సంచలనం అయ్యేలా వెంకటేష్ తో ఒక సిరీస్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. దీనిపై తేజతో డిస్కషన్ జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది మెటీరియలైజ్ అయితే మాత్రం తెలుగు సినిమా ఓటిటీ రంగంలో కదం తొక్కడం ఖాయం.