‘ఉప్పెన’ సినిమాతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ పంజా. ఈ సినిమా అసాధారణ విజయాన్నందుకోవడంతో వైష్ణవ్‌కు బోలెడన్ని అవకాశాలు గ్యారెంటీ అనిపిస్తోంది. అతను అప్పుడే పారితోషకం కూడా పెంచేసినట్లు చెబుతున్నారు. విశేషం ఏంటంటే.. ‘ఉప్పెన’ విడుదల కావడానికి ముందే వైష్ణవ్ హీరోగా తన రెండో సినిమాను కూడా పూర్తి చేసేశాడు.
లాక్ డౌన్ టైంలో సీనియర్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో అతనో సినిమాలో నటించాడు. రకుల్ ప్రీత్ ఇందులో కథానాయిక. ఈ చిత్రంలోనూ వైష్ణవ్ చేసింది డీగ్లామరస్ రోలే. ఈ చిత్రం పూర్తిగా అటవీ నేపథ్యంలో సాగుతుంది. వికారాబాద్ అడవుల్లోనే షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి ఇప్పుడు టైటిల్ కూడా ఖరారు చేసినట్లు సమాచారం. ‘జంగిల్ బుక్’ అనే పాపులర్ టైటిల్‌ను ఈ సినిమా కోసం వాడుకుంటున్నారట.
రాయలసీమకు చెందిన ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. దాన్ని క్రిష్ తనదైన శైలిలో చిత్రానువాదం చేసినట్లు తెలుస్తోంది. ముందు ఈ సినిమాకు ‘కొండపొలం’ అనే టైటిలే పెట్టాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆలోచన మారిందని.. క్రిష్ ‘జంగిల్ బుక్’ అనే టైటిల్‌ను దీనికి ఖరారు చేశాడని అంటున్నారు. త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తారని అంటున్నారు. క్రిష్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తక్కువ రోజుల్లో, పరిమిత బడ్జెట్లో సినిమా పూర్తయింది.
వైష్ణవ్‌కు ఇది మరో వైవిధ్యమైన సినిమా అవుతుందని, రకుల్‌కు కూడా మంచి పేరొస్తుందని అంటున్నారు. సీనియర్ సంగీత దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. దీని తర్వాత వైష్ణవ్ తేజ్.. అక్కినేని నాగార్జున నిర్మాణంలో ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 28, 2021 12:58 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…