పెద్దగా అంచనాల్లేకుండా వచ్చి అనూహ్యమైన ఫలితాన్నందుకుంది ‘దృశ్యం-2’. ‘దృశ్యం’కు సీక్వెల్ అనగానే ఆ కథను పొడిగించడానికి ఇంకేముంది అనుకున్నారు. పైగా ఈ సినిమాను నెలన్నరలో పూర్తి చేసేయడం, థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడంతో దీనిపై అంచనాలు మరింత తగ్గాయి. ‘దృశ్యం’ సినిమాతో వచ్చిన పేరును క్యాష్ చేసుకోవడానికి చేసిన సినిమాలా కనిపించిందిది.
కానీ ‘దృశ్యం’కు ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ చేసి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. అమేజాన్ ప్రైమ్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న ఇండియన్ సినిమాల్లో ఒకటిగా ‘దృశ్యం-2’ నిలవబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో జీతు జోసెఫ్ పేరు మరోసారి మార్మోగిపోయింది. ఆయన వరుసబెట్టి మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘దృశ్యం-3’ గురించి కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు జీతు.
‘దృశ్యం’ రిలీజైన టైంలో దీని సీక్వెల్ గురించి తాను ఆలోచించలేదని, అనుకోకుండా ఇప్పుడు ఆ సినిమా తీశానని.. ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచన లేకపోయినా భవిష్యత్తులో ఇలాగే ‘దృశ్యం-3’ తీసే అవకాశాలు లేకపోలేదని అన్నాడు జీతు. ఐతే కొన్ని రోజుల వ్యవధిలోనే ఆయన మాట మారిపోయింది. ఇప్పుడు తాజాగా మరో ఇంటర్వ్యూలో ‘దృశ్యం-3’ కచ్చితంగా ఉంటుందనే సంకేతాలు ఇచ్చారాయన. ‘దృశ్యం-3’కి తాను ఇప్పటికే క్లైమాక్స్ రాసేసినట్లు వెల్లడించి పెద్ద షాకే ఇచ్చాడు జీతు. కానీ ఈ సినిమా వెంటనే మాత్రం చేయబోనన్నాడు. పూర్తి స్క్రిప్టు తయారు చేయడానికి మూడేళ్లు పడుతుందని చెప్పాడు. సీక్వెల్‌కు ఆ మాత్రం గ్యాప్ కూడా అవసరమన్నాడు. 2025లో ‘దృశ్యం-3’ కార్యరూపం దాల్చే అవకాశమున్నట్లు చెప్పాడు.
ఐతే ‘దృశ్యం-2’ చూశాక మూడో భాగంపై భారీ అంచనాలు నెలకొనడం ఖాయం. ఆ కథ దీనికి భిన్నంగా ఏదైనా మలుపు తిరగాలి. మళ్లీ ఇదే స్టయిల్లో జార్జి కుట్టి పోలీసులను బురిడీ కొట్టిస్తే బాగుండదు. మరి ‘దృశ్యం-3’లో జీతు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
This post was last modified on February 27, 2021 3:48 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…