యేలేటి నుంచి ఇది ఊహించ‌లేదు

విల‌క్ష‌ణ చిత్రాల‌కు పెట్టింది పేరైన చంద్ర‌శేఖ‌ర్ యేలేటి నుంచి వ‌చ్చిన కొత్త సినిమా చెక్. శుక్ర‌వార‌మే ఈ చిత్రం థియేట‌ర్ల‌లో దిగింది. యేలేటి సినిమా అంటే ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల్లో మంచి గురి ఉంటుంది. వాళ్లు ప‌రుగెత్తుకుని సినిమాకు వ‌చ్చేస్తారు. భారీ అంచ‌నాల‌తో ఆయ‌న సినిమా చూస్తారు. సాధార‌ణ ప్రేక్ష‌కులు చెక్ ప‌ర్వాలేదని, చ‌ల్తా అని అంటుంటే.. యేలేటి అభిమానులే ఈ సినిమా ప‌ట్ల ఎక్కువ‌గా అసంతృప్తిని వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

ఎందుకంటే ఆయ‌న‌పై వార‌కున్న అంచ‌నాలు అలాంటివి. ఐతే, అనుకోకుండా ఒక రోజు లాంటి చిత్రాల‌తో యేలేటి కెరీర్ ఆరంభంలోనే త‌న‌పై అంచ‌నాలు బాగా పెంచేశాడు. స్క్రీన్ ప్లే విష‌యంలో మాస్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఏం తీసినా ఒరిజిన‌ల్‌గా ఉంటుంద‌ని, కాపీకి ఛాన్సే ఉండ‌ద‌ని బ‌లంగా న‌మ్ముతారు యేలేటి అభిమానులు.

ఇలాంటి ద‌ర్శ‌కుడు చెక్ సినిమా క్లైమాక్స్ విష‌యంలో హాలీవుడ్ క్లాసిక్ శ్వ‌శాంక్ రిడెంప్ష‌న్‌ను ఫాలో అయిపోవ‌డం చాలామందికి ఆశ్చ‌ర్యం క‌లిగించింది. ఈ సినిమాలో ఈ ట్విస్ట్ ప్రేక్ష‌కుల‌ను బాగానే థ్రిల్ చేస్తుంది. ఇలాంటి క్లైమాక్స్ ఊహించ‌రు. కానీ శ్వ‌శాంక్ రిడెంప్ష‌న్ చూసిన వాళ్ల‌కు మాత్రం ఆ సినిమా క్లైమాక్స్‌ను యేలేటి కాపీ కొట్టేశాడ‌నే అనిపిస్తుంది. ఎందుకంటే అందులోనూ హీరో చేయ‌ని నేరానికి జైలు శిక్ష అనుభ‌విస్తుంటాడు. చివ‌ర్లో ఎవ‌రూ ఊహించ‌నిది చేస్తాడు.

చెక్ క‌థ‌, క్లైమాక్స్ ట్విస్టు దానికి ద‌గ్గ‌ర‌గా ఉండ‌టం యేలేటి అభిమానుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఏదో పేరులేని సినిమా నుంచి ఐడియా తీసుకున్నా ఓకే కానీ.. ఆల్ టైం క్లాసిక్స్‌లో ఒక‌టిగా పేరున్న సినిమా నుంచి ఆయ‌న కాపీ కొట్ట‌డం ఏంట‌ని అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో పాటుగా నెట్ ఫ్లిక్స్ ఒరిజిన‌ల్ మూవీ క్వీన్స్‌ గాంబెట్‌తోనూ చెక్‌కు కొంచెం పోలిక‌లు క‌నిపించాయి.