సినిమా నిర్మాణం మళ్ళీ తొందర్లోనే ట్రాక్ మీదకు రానుంది. జూన్ నుంచి గవర్నమెంట్ పర్మిషన్ వస్తుందని సమాచారం. అయితే వెంటనే షూటింగ్ కి వెళ్లిపోకుండా కరోనా రహిత భారతం అయ్యే వరకు ఏమి చెయ్యాలి, అలాగే ఇన్ని రోజుల నష్టాన్ని ఎలా భర్తీ చేయాలి అనే దానిపై కసరత్తు జరగనుంది.
ఆర్టిస్టులు, టెక్నిషియన్లు పారితోషికం తగ్గించుకోవాలనేది ఒక ప్రతిపాదన. అయితే దాంతో పాటు సెట్స్ లో జరిగే వేస్ట్ ఖర్చులు తగ్గించాలని డిసైడ్ అయ్యారు. ఒక్కో ముఖ్య ఆర్టిస్ట్ కి ఒక్కో ప్రత్యేక క్యారవాన్ ఇవ్వడం ఆనవాయితీ.
కానీ ఇకపై హీరో హీరోయిన్లకి కూడా పార్టిషన్ తో కూడిన క్యారవాన్ ఇవ్వాలని, అలాగే రెండొందల మంది క్రూ పని చేసే చోట వంద మందితోనే చెయ్యాలని, దీనికి చిన్న, పెద్ద సినిమాలు అతీతం కాదని, నిర్మాతలు కొన్ని నిబంధనలు సిద్ధం చేసుకుంటున్నారు. ముందు కాస్ట్ అఫ్ ప్రొడక్షన్ తగ్గించే మార్గాలని చూసుకుని అటుపై పారితోషికాల పరంగా ఎంత కొత్త విధించాలనేది నిర్ణయిస్తారు.
This post was last modified on May 8, 2020 9:41 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…