మలయాళ సూపర్ హిట్ మూవీ దృశ్యంకు సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం-2: ది రిసెంప్షన్ అమేజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదలై అదిరిపోయే టాక్‌తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇండియాలో వచ్చిన ఉత్తమ సీక్వెల్స్‌లో ఒకటిగా దీన్ని చెబుతున్నారు విశ్లేషకులు. సినిమా చూసి వాళ్లు ఈ మాటతో కచ్చితంగా ఏకీభవిస్తారు. ఐతే ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని గత ఏడాది మధ్య వరకు ఎవరూ ఊహించలేదు. దృశ్యం వచ్చాక ఐదేళ్లలో ఎప్పుడూ కూడా ఆ చర్చే లేదు. కానీ గత ఏడాది కరోనా విరామం తర్వాత జీతు జోసెఫ్-మోహన్ లాల్ హఠాత్తుగా సినిమాను మొదలుపెట్టారు. శరవేగంగా పూర్తి చేశారు.
గత శుక్రవారం పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. త్వరలోనే ఈ చిత్ర తెలుగు వెర్షన్ కూడా సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఐతే దృశ్యం-2 చూసిన వాళ్లకు ఈ కథకు కొనసాగింపుగా మూడో సినిమా కూడా వస్తుందేమో అన్న సందేహాలు తలెత్తాయి. ఈ కథలో ఆ స్కోప్ లేకుండా ఏమీ లేదు.
ఇదే విషయంపై దర్శకుడు జీతు జోసెఫ్‌ను ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతానికైతే దృశ్యం-3 తీసే ఆలోచన తనకు లేదన్నాడు. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమన్నాడు. ఏదైనా లైన్ దొరికి ఈ కథను కొనసాగించవచ్చు అనిపిస్తే సినిమా చేయొచ్చన్నాడు. దృశ్యం సినిమా రిలీజైనపుడు అందరూ దీనికి సీక్వెల్ ఉంటుందా అని అడిగారని, తాను ఆ అవకాశం లేదని చెప్పానని.. కానీ గత ఏడాది సీక్వెల్‌పై ఆలోచన వచ్చిందని, సినిమా తీశామని.. ఈ చిత్రానికి ఇలాంటి స్పందన వస్తుందని అసలు ఊహించలేదని జీతు చెప్పాడు.
తెలుగులో వెంకటేష్ హీరోగా దృశ్యం-2 చేస్తున్న విషయాన్ని ధ్రువీకరించిన జీతు.. మిగతా భాషల్లో రీమేక్ గురించి ప్రస్తుతానికి ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు. తెలుగులో ఈ సినిమాను థియేటర్ల ద్వారా రిలీజ్ చేస్తాం కాబట్టి మంచి రీచ్ ఉంటుందని ఆశిస్తున్నట్లు జీతు తెలిపాడు.
This post was last modified on February 23, 2021 8:53 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…