ఈ మధ్య కాలంలో ఇంతకంటే క్రేజీ రూమర్ ఇంకోటి లేదేమో. టాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ అరంగేట్రానికి సిద్ధమవుతున్నట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోందిప్పుడు. భారతీయ మూలాలున్న హాలీవుడ్ దర్శకుడు మనోజ్ నైట్ శ్యామలన్ తాను తీయబోయే కొత్త సినిమాలో ఓ పాత్ర కోసం తారక్‌ను సంప్రదించినట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం బయటికి రావచ్చని అంటున్నారు.
ది సిక్స్త్ సెన్స్, అన్‌బ్రేకబుల్, సైన్స్, స్ప్లిట్ లాంటి చిత్రాలతో హాలీవుడ్లో మనోజ్ గొప్ప పేరే సంపాదించాడు. చివరగా ఆయన్నుంచి 2019లో గ్లాస్ అనే సినిమా వచ్చింది. గత ఏడాది నుంచి ఆయన కొత్త సినిమా కోసం ప్రిపేరవుతున్నాడు. ఆ సినిమాలో తారక్‌కు ఓ పాత్రను ఆఫర్ చేశాడని అంటున్నారు.
ఐతే ఈ వార్త ఎంత వరకు నిజం అన్నదే సందేహంగా ఉంది. స్టార్ హీరోల అభిమానులు.. తమ కథానాయకుడి గురించి సోషల్ మీడియాలో చర్చ జరగడం కోసం ఇలాంటి రూమర్లు పుట్టించడం మామూలే. అలాగే కొందరు యాంటీ ఫ్యాన్స్ సైతం ఇలాంటి వార్తలు పుట్టించి.. ఆ హీరో అభిమానులు అతి చేశాక, అది అబద్ధమంటూ గాలి తీయడానికి కూడా ఇలాంటివి చేస్తుంటారు. కాబట్టి ఈ వార్త నిజం అనుకోవడానికి లేదు.
నిజంగా తారక్.. హాలీవుడ్ సినిమాలో నటించేట్లయితే మాత్రం అది గొప్ప విషయమే. తారక్ ఆ సినిమా చేస్తాడో లేదో అన్నది తర్వాత.. మనోజ్ లాంటి దర్శకుడు తారక్‌ను అడిగాడన్నా కూడా విశేషంగా చెప్పుకోవాల్సిందే. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ప్రస్తుతం తారక్ ‘ఆర్ఆర్ఆర్’ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత అతను వరుసగా త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్‌ల దర్శకత్వంలో నటించాల్సి ఉంది. మరి హాలీవుడ్ డెబ్యూ గురించి అసలు నిజమేంటో చూద్దాం.
This post was last modified on February 22, 2021 1:37 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…