టాలీవుడ్ బాక్సాఫీస్‌లో మళ్లీ సినిమాల జాతర మొదలైంది. ప్రేక్షకులు మునుపటి లాగే థియేటర్లకు వస్తుండటం, ఆక్యుపెన్సీని కూడా 100 శాతానికి పెంచేయడం, అన్ సీజన్లోనూ బాగున్న సినిమాలకు భారీ వసూళ్లు వస్తుండటంతో ఇక కొత్త సినిమాలను విడుదల చేసే విషయంలో ఇక తటపటాయించాల్సిన అవసరం ఏమీ లేకపోయింది. వారం వారం రెండు మూడు సినిమాలు రిలీజైపోతున్నాయి. ఈ వారం మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అవే.. నాంది, కపటధారి, చక్ర. వీటితో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో ‘పిట్టకథలు’ అనే వెబ్ సిరీస్ కూడా రిలీజైంది.
థియేట్రికల్ రిలీజ్‌ల్లో ఏదీ కూడా ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తి పరచలేకపోయింది. అల్లరి నరేష్‌కు ‘నాంది’ ఓ డిఫరెంట్ మూవీనే. దీని కాన్సెప్ట్ కూడా బాగుంది. కానీ సినిమా అనుకున్నంత పకడ్బందీగా, ఇంటెన్స్‌గా లేకపోవడంతో ప్రేక్షకులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇది తీసిపడేయదగ్గ సినిమా కాదు. నరేష్ పెర్ఫామెన్స్ కోసమైనా ఈ సినిమా చూడొచ్చు.
ఇక కన్నడలో విజయవంతమైన ‘కవుల్దారి’కి రీమేక్‌గా వచ్చిన సుమంత్ చిత్రం ‘కపటధారి’ అంచనాలను అందుకోలేకపోయింది. మాతృకను యాజిటీజ్ ఫాలో అయినప్పటికీ సినిమా అనాసక్తికరంగా, నెమ్మదిగా అనిపించి ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. సుమంత్‌కు ఈ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వడం సందేహమే. ఇక విశాల్ ‘చక్ర’ విషయానికి వస్తే.. ‘అభిమన్యుడు’ స్టయిల్లోనే సైబర్ థ్రిల్లర్‌గా దీన్ని తీర్చిదిద్దారు. కానీ ‘అభిమన్యుడు’ స్థాయికి దగ్గరగా కూడా ఈ సినిమా లేదు. అంత పకడ్బందీ థ్రిల్లర్ చూశాక దాని ముందు ‘చక్ర’ తేలిపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడ్డం కష్టమే.
ఇక ‘పిట్టకథలు’ విషయానికి వస్తే అందులో ‘పింకీ’ మినహా మూడు కథలు ఓకే అనిపించాయి. ‘రాములా’కు ఫస్ట్ ప్లేస్ దక్కుతుంది. ‘మీరా’; ‘ఎక్స్ లైఫ్’ కూడా ఓకే. ‘పింకీ’నే వీక్. ఓవరాల్‌గా ఒకసారి చూడటానికి ‘పిట్టకథలు’ ఓకే. ఐతే పై మూడు థియేట్రికల్ రిలీజ్‌లు, ఈ వెబ్ సిరీస్‌తో పోలిస్తే ప్రేక్షకులను ఈ వీకెండ్లో ఎక్కువ మెప్పిస్తున్నది మాత్రం అమేజాన్‌లో నేరుగా రిలీజైన ‘దృశ్యం-2’ చిత్రమే.
‘దృశ్యం’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా మాతృక కంటే కూడా పకడ్బందీగా తెరకెక్కి వావ్ అనిపిస్తోంది. దృశ్యం తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ రీమేక్ అయి హిట్‌గా నిలిచిన నేపథ్యంలో ‘దృశ్యం-2’ మీద అన్ని భాషల వాళ్లకూ దీనిపై ఆసక్తి ఉంది. ఇండియాలో వచ్చిన బెస్ట్ సీక్వెల్స్‌లో ఒకటిగా దీన్ని పేర్కొంటున్నారు విశ్లేషకులు. ఈ వీకెండ్ విన్నర్ ఈ సినిమానే.
This post was last modified on February 20, 2021 2:05 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…