Movie News

2.0 నిర్మాతల చేతికి ‘ఆర్ఆర్ఆర్’

‘బాహుబలి’కి దేశవ్యాప్తంగా అంతటి ఆదరణ లభిస్తుందని, వివిధ భాషల వాళ్లు ఈ సినిమాను చూసి అంతగా ఊగిపోతారని.. ఆ చిత్రం మొదలైనపుడు ఎవ్వరూ ఊహించి ఉండరు. దానికి అన్నీ కలిసొచ్చి ఒక మ్యాజిక్ జరిగిపోయింది. మళ్లీ రాజమౌళి తలుచుకున్నా ఇలాంటి మ్యాజిక్‌ను రిపీట్ చేయలేడని, మరో సినిమాకు ఇంత క్రేజ్ తీసుకురాలేడని అంతా అనుకున్నారు. కానీ జక్కన్న కొత్త సినిమా ‘ఆర్ఆర్ఆర్’కు సైతం క్రేజ్ తక్కువగా ఏమీ లేదు.

సినిమా ఎలా ఉంటుంది.. ‘బాహుబలి’ని మ్యాచ్ చేస్తుందా లేదా.. రాజమౌళి తనపై పెట్టుకున్న అంచనాలను అందుకుంటాడా లేదా అన్నది పక్కన పెడితే.. ప్రి రిలీజ్ బిజినెస్‌లో మాత్రం ‘ఆర్ఆర్ఆర్’.. ‘బాహుబలి’కి తక్కువగా ఏమీ నిలిచేలా లేదు. ఈ చిత్రానికి తెలుగులోనే కాక వివిధ భాషల నుంచి భారీ బిజినెస్ ఆఫర్లే వస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా సరే.. కేవలం రాజమౌళి పేరు చూసి ‘ఆర్ఆర్ఆర్’కు తమిళంలో కళ్లు చెదిరే బిజినెస్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం.

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్‌తో ‘2.0’ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ ‘ఆర్ఆర్ఆర్’ తమిళ వెర్షన్ హక్కులు సొంతం చేసుకున్నట్లు సమాచారం. అందుకోసం ఏకంగా రూ.45 కోట్లు వెచ్చించిందట ఆ సంస్థ. ఇది దగ్గర దగ్గర ‘బాహుబలి: ది కంక్లూజన్’ రేటుకు సమానం. ‘బాహుబలి: ది బిగినింగ్’ తర్వాత ‘ది కంక్లూజన్’కు తమిళంలో కూడా ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే. కానీ ‘ఆర్ఆర్ఆర్’లో ఇప్పటి వరకు చూస్తే తమిళ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేు అంశాలు తక్కువే. రాజమౌళి అనే పేరు తప్ప వారిని ఆకర్షించే అంశాలు పెద్దగా కనిపించడం లేదు.

అయినా సరే.. ఈ చిత్రానికి ఈ రేటు దక్కిందంటే ఆశ్చర్యమే. పబ్లిసిటీ, ఇతర ఖర్చులు కలిపితే ఈ చిత్రానికి తమిళంలో రూ.50 కోట్ల షేర్ వస్తేనే బ్రేక్ ఈవెన్ అన్నమాట. అది పెద్ద టాస్కే. మరి జక్కన్న ఈ టాస్క్‌ను ఎలా ఛేదిస్తాడో చూడాలి. లైకా వాళ్ల బేనర్ మీద రిలీజ్ అంటే హడావుడి మామూలుగా ఉండదు. వాళ్ల పబ్లిసిటీనే వేరుగా ఉంటుంది. దసరా కానుకగా అక్టోబరు 13న ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే.

This post was last modified on February 16, 2021 3:19 pm

Share

Recent Posts

పవన్ పాలనకు చిరు కితాబు

తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…

1 hour ago

రామాయణ చుట్టూ పోటీ ఆంజనేయుళ్లు

నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…

2 hours ago

పిల్లల స్కూలు విషయాలు సూర్యనే చూసుకుంటాడు

తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…

2 hours ago

రవితేజకు జోడీ ఎవరు?

మాస్ రాజా రవితేజ కొత్త సినిమా కబురు వచ్చేసింది. కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నట్లే విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయ…

2 hours ago

మస్క్‌కు BYD ప్రశ్న… సమాధానం ఏది?

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యాపారవేత్తల కారణంగానే తమ…

2 hours ago

టార్గెట్ @ 100 ప‌ర్సంట్‌: మంత్రుల‌కు బాబు బిగ్ టాస్క్‌

ఏపీ మంత్రుల‌కు సీఎం చంద్ర‌బాబు బిగ్ టాస్క్ విధించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ఏపీ మంత్రివ‌ర్గం..…

2 hours ago