చిన్నా.. అతను మా శివ సినిమాకి ఆడిషన్ కి వచ్చినప్పుడు అతని పేరు జితేంద్ర.. తర్వాత శివ సినిమాలో అతని క్యారక్టర్ పేరు అయిన చిన్నా నే తన పేరుగా మార్చుకున్నాడు.. ఫస్ట్ ఇతన్ని వద్దని రామూ కి చెప్పాను.. కానీ ఫస్ట్ డే షూట్ లో అతని నటన చూసాక.’ రామూ కు నిన్ను వద్దని చెప్పాను.. కానీ నీ యాక్టింగ్ చూసాక నేను రాంగ్ అనుకుంటున్నాను.. నువ్వు పైకి వస్తావ్ అని చెప్పాను.. ఒక సందర్భం లో నేను ఇంతవరకు ఫ్లయిట్ ఎక్కలేదంటే.. నెక్స్ట్ షెడ్యూల్ లో నిన్ను ఫ్లయిట్ ఎక్కిస్తాను అని చాలా క్యాజువల్ గా అన్నాను.
నెక్స్ట్ షెడ్యూల్ లో చిన్నా డెత్ సీన్ ప్లాన్ చేసి ఒకరోజు ముందు ఉండేలా అతనికి ట్రైన్ టిక్కెట్ తీయించాను.. కానీ రామూ ఈరోజు రాత్రి చిన్నా డెత్ సీన్ తీద్దామన్నాడు.. లేదు రామూ రేపు ప్లాన్ చేసాను.. రేపు ఉదయం చిన్నా హైదరాబాద్ లో ఉంటాడు అన్నాను.. కాదు కాదు ఈ రోజే తీద్దాం.. ఈవినింగ్ ఫ్లయిట్ కి పిలిపించండి అని గట్టిగా చెప్పాడు.. విధి లేక సాయంత్రం ఫ్లయిట్ టిక్కెట్ తీసి అతనిని పంపమని మద్రాస్ ఆఫీస్ కి ఫోన్ చేసి చెప్పాను.. మేమంతా లొకేషన్ కి వెళ్ళాం 5గంటలకు.. చిన్నా ఫ్లైట్ దిగి పరుగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి తన బోర్డింగ్ పాస్ నాకిచ్చి దీనిమీద ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని నా ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు.. అప్పటినుండి చిన్నా నాకు బాగా క్లోస్ అయ్యాడు..అప్పట్లో మేము మద్రాస్ నుండి వచ్చి శివ షూటింగ్ టైం లో అశోక హోటల్ లో ఉండేవాళ్ళం.. ఎర్లీ గా షూటింగ్ అయిపోయినప్పుడు ఫ్రెష్ అయ్యి సాయంత్రం వేరే హోటల్ కి డిన్నర్ కి వెళ్ళేవాళ్ళం.. ఎవరో ఒకరం బిల్ పే చేసేవాళ్ళం.. చిన్నా మాత్రం జేబులు తడుముకుని పర్స్ మర్చిపోయాను అనేవాడు..
ఇలాగే మరొకరోజు అందరం డిన్నర్ కి అని బయలుదేరాం.. చిన్నా కూడా కార్లో వున్నాడు.. ఎవరికోసమో వెయిటింగ్.. సడన్ గా చిన్నా కార్ దిగి పరిగెత్తుకుంటూ రూమ్ కి వెళ్ళివచ్చాడు.. “పర్స్ మర్చిపోయి వచ్చావ్ కదూ ‘ అన్నాను.. “అవును సార్” అన్నాడు.. “మర్చిపోయి జేబులోపెట్టుకువచ్చావ్.. ఇప్పుడువెళ్లి రూమ్ లో పెట్టి వచ్చావ్ కదూ ” అన్నాను.. “పెద్దగా అనకండి సార్” అని చిన్నగా నా చెవిలో చెప్పాడు చిన్నా…. తర్వాత నా మనీ సినిమాలో ఇద్దరు హీరోలలో చిన్నా ఒకడు.. తర్వాత నేను చేసిన ఒన్స్ మోర్.. లక్కీ ఛాన్స్.. హాండ్స్ అప్ లలో కూడా యాక్ట్ చేసాడు..
ఒక సారి ఒన్స్ మోర్ షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను ప్రకృతి వైద్యం కారణంగా స్ప్రౌట్స్ ఇంటినుండే తీసుకెళ్లి బ్రేక్ఫాస్ట్ టైం లో తినేవాడిని.. చిన్నా అప్పటికి బ్రేక్ఫాస్ట్ చేసి.. నా స్ప్రౌట్స్ బాక్స్ చూడగానే కుర్రాడిని పిలిచి ఒక బౌల్ స్పూన్ తెమ్మనేవాడు.. నా బాక్స్ లో దాదాపు సగభాగం తను తినేవాడు .. “నీకెందుకు చిన్నా నువ్ బ్రేక్ ఫాస్ట్ చేసావ్ గా” అంటే.. “బాగున్నాయండి” అన్నాడు.. “సరే.. రేపటినుండి ఇద్దరికీ తెస్తాను.. నువ్వు ఇక్కడ బ్రేక్ ఫాస్ట్ చెయ్యడం మానెయ్యి” అన్నాను.. “కష్టం సార్”.. అన్నాడు.. “అయితే నాది ప్రకృతి వైద్యం.. నీది కక్కుర్తి వైద్యం అవుద్ది” అన్నాను… పెద్దగా నవ్వాడు..
ఒక రోజు షాట్ గ్యాప్ లో ఒక్కడే కూర్చుని పాట పాడుకుంటున్నాడు.. పక్కనే కూర్చున్న నేను.. “చిన్నా నువ్వు పాటలు అద్భుతంగా చదువుతావ్.. బాలుగారు. మనో కూడా నీ అంత బాగా చదవలేరు.. పాపం వాళ్ళు కేవలం పాడగలరు” అన్నాను.. “అయితే నేను పాడింది బాగా లేదా” అన్నాడు.. “నువ్వు పాడుతున్నాను అనుకుంటున్నావు కానీ చదువుతున్నావ్.. పాడటం అంటే దానికి ఒక రాగం. తాళం ఉంటాయి.. అవేవీ లేకుండా అద్దుతంగా చదువుతున్నావ్ అన్నాను”…..
— శివ నాగేశ్వర రావు
This post was last modified on February 13, 2021 12:34 pm
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…