హిట్టిస్తే మళ్ళీ చైతూతో..

ప్రేమమ్ చిత్రాన్ని తెలుగులో సక్సెస్ చేయగలరా అనే డౌట్స్ వ్యక్తమయ్యాయి. కానీ దాన్ని సక్సెస్ చేసి చూపించాడు చందు మొండేటి. అయితే నాగ చైతన్యతో వెంటనే చేసిన సవ్యసాచి పెద్ద ప్లాప్ అయింది. ఆ సినిమా తర్వాత చైతన్యతో అభిప్రాయబేధాలు వచ్చాయనే వార్తల్లో నిజం లేదని చందు చెప్పాడు.

చైతూ ఇప్పటికీ తనకి మంచి స్నేహితుడని, త్వరలోనే మళ్ళీ తమ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అంటున్నాడు. ప్రస్తుతం కార్తికేయ 2 చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్న చందు.. ఈ సినిమా హిట్టయితే చైతన్య నుంచి కబురు వస్తుందని ఆశిస్తున్నాడు.

కార్తికేయ, ప్రేమమ్ తర్వాత ఇండస్ట్రీలో బాగా నలిగిన చందు మొండేటి పేరు ఒకే ప్లాప్ తో వినిపించకుండా పోయింది. దాంతో తన తొలి హీరో నిఖిల్ తో కార్తికేయ 2కి శ్రీకారం చుట్టాడు.