‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఉన్నట్లుండి సినిమా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత కూడా పెద్దగా టైం తీసుకోకుండా సినిమాను మొదలుపెట్టేశారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. రెండో షెడ్యూల్లోకి వెళ్లబోతోంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి.
ఐతే ఈ సినిమా కథాంశం పట్ల ఎప్పటికప్పుడు రకరకాల ప్రచారాలు జరుగుతుండటం చర్చనీయాంశమవుతోంది. ముందు ఈ సినిమా ప్రశాంత్ తొలి చిత్రం ‘ఉగ్రం’కు రీమేక్ అని వార్తలొచ్చాయి. ఈ ప్రచారం గట్టిగానే సాగింది. ఐతే ఈ మధ్య ప్రశాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సలార్’ ఏ చిత్రానికీ రీమేక్ కాదనేశాడు. ఇది ప్రభాస్ కోసమే తయారైన కథ అన్నాడు. అంతటితో రీమేక్ ప్రచారానికి తెరపడిందనే అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.
‘కేజీఎఫ్’తో సంగీత దర్శకుడిగా గొప్ప పేరు సంపాదించి.. ‘సలార్’కు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికైన రవి బస్రార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సలార్’ సినిమా ‘ఉగ్రం’కు రీమేకే అని స్పష్టం చేశాడు. ఈ చిత్రం ‘ఉగ్రం’కు రీమేక్ అంటున్నారు కదా, దానిపై ఏమంటారు అని ఓ యూట్యూబ్ ఛానెల్లో ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే.. ‘‘అది అందరికీ తెలిసిన విషయమే కదా’’ అనేశాడు రవి. దానికి కొనసాగింపుగా మాట్లాడుతూ.. ‘‘ఐతే ఈ సినిమాను ఇతనెలా (ప్రభాస్) చేస్తాడో చూడాలి’’ అన్నాడు.
రవి ఇంత క్యాజువల్‌గా ‘సలార్’ సినిమా ‘ఉగ్రం’కు రీమేక్ అనేయడంతో ప్రశాంత్ ఎందుకు అలా చెప్పాడనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ‘సలార్’ రేప్పొద్దున కన్నడలో సైతం విడుదలవుతుంది. అప్పుడైనా ‘ఉగ్రం’కు రీమేక్ అని తెలియకుండా ఉంటుందా.. అప్పుడు చూసిన సినిమానే మళ్లీ ప్రభాస్ హీరోగా చూస్తే కన్నడ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది ప్రశ్నార్థకం. బహుశా ‘ఉగ్రం’ ప్లాట్ తీసుకుని దాన్ని ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్లుగా మార్చి పెద్ద స్కేల్లో ఈ సినిమా చేస్తుండొచ్చేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.
This post was last modified on February 12, 2021 7:19 pm
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…
ఓ మూడేళ్ళ క్రితం దాకా టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డేను వరస బ్లాక్ బస్టర్లు ఉక్కిరిబిక్కిరి…