ఒక కలల కాంబినేషన్‌కు తెరలేచినట్లు టాలీవుడ్ సర్కిల్స్‌లో ఇప్పుడు హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ మెగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోందట. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడట. నిన్న రాత్రి నుంచి టాలీవుడ్ సర్కిల్స్‌లో, సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.
శంకర్ తెలుగులో ఓ సినిమా చేస్తానని ఎప్పట్నుంచో అంటున్నాడు. మన హీరోలు కూడా ఆయనతో పని చేయాలని తహతహలాడిన వాళ్లే. కానీ ఇంత వరకు అది సాధ్యపడలేదు. ఎట్టకేలకు రామ్ చరణ్ శంకర్‌తో పని చేసే అవకాశాన్నందుకున్నాడు. కెరీర్ ఆరంభంలో తీసిన జెంటిల్‌మ్యాన్, ప్రేమికుడు, భారతీయుడు సినిమాలతో శంకర్ తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించాడు. హీరో ఎవరన్నది సంబంధం లేకుండా అతడి పేరు మీద ఇక్కడ సినిమాలు ఆడటం మొదలైంది. ‘బాయ్స్’ సినిమా తమిళంలో ఫ్లాప్ అయి తెలుగులో హిట్టవడం ఇక్కడి జనాలకు ఆయనమీదున్న అభిమానానికి నిదర్శనం.
తెలుగులో తన సినిమాల విడుదలప్పుడు ఇక్కడి ప్రేక్షకుల అభిమానం గురించి ప్రత్యేకంగా మాట్లాడుతుంటాడు శంకర్. తెలుగులో సినిమా తీస్తా అని అంటుంటాడు. ఇప్పుడు ఎట్టకేలకు ఆ హామీని నెరవేర్చబోతున్నాడు. ప్రస్తుతం శంకర్ తమిళంలో ‘ఇండియన్-2’ తీస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం మొదలై రెండున్నరేళ్లు కావస్తోంది. వివిధ కారణాలతో ఆ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. చివరగా కరోనా కారణంగా సినిమాకు బ్రేక్ పడింది. త్వరలోనే షూటింగ్ పున:ప్రారంభించి.. కొన్ని నెలల్లోనే దాన్ని పూర్తి చేసి ఆ తర్వాత రామ్ చరణ్ సినిమాను శంకర్ మొదలుపెట్టాలనుకుంటున్నట్లు సమాచారం.
This post was last modified on February 11, 2021 10:40 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…