Movie News

‘వకీల్ సాబ్’ అత్యాశకు పోతే…

తమ హీరో సినిమాకు అత్యధిక బిజినెస్ జరగాలని, రికార్డులు బద్దలైపోవాలని ఆశిస్తుంటారు సాధారణంగా అభిమానులు. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానుల తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ‘వకీల్ సాబ్’ బిజినెస్ పరంగా రికార్డులేమీ బద్దలు కొట్టేయొద్దని వాళ్లు కోరుకుంటున్నారు. పవన్‌తో సినిమా అని అత్యాశకు పోవొద్దని, రీజనబుల్ రేట్లకే అమ్మాలని నిర్మాత దిల్ రాజుకు విన్నపాలు చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదేం చిత్రం అనిపించొచ్చు కానీ.. పవన్ గత సినిమాల అనుభవాల నేపథ్యంలో వారికి ఇలా అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు.

పవన్‌తో సినిమా అంటే బంగారు బాతులా భావించే నిర్మాతలు ట్రేడ్‌లో ఉన్న క్రేజ్‌ను బట్టి అయినకాడికి రేట్లకు సినిమాను అమ్మడం సర్వ సాధారణం అయిపోయింది. సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు లాంటి మామూలు సినిమాలను కూడా విపరీతమైన రేట్లకు అమ్మారు. ఇక త్రివిక్రమ్‌తో చేసిన క్రేజీ మూవీ ‘అజ్ఞాతవాసి’ సంగతి చెప్పాల్సిన పనే లేదు. గత సినిమా ఎంత నిరాశ కలిగించినా తర్వాతి సినిమాకు రేట్లు పెరిగాయి తప్ప తగ్గలేదు. ఐతే ఈ సినిమాలేవీ అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఓపెనింగ్స్ వరకు మాత్రమే జోరు కనిపించలేదు. రికవరీ ఎంతమాత్రం సాధ్యపడలేదు. దీంతో బయ్యర్లకు భారీ నష్టాలు తప్పలేదు. ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ అనిపించుకున్నాయి.

ఇప్పుడిక ‘వకీల్ సాబ్’ విషయానికి వస్తే ఇదొక రీమేక్ మూవీ, పైగా లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. దర్శకుడు వేణు శ్రీరామ్ ఎంతగా హీరోయిజం టచ్ ఇచ్చినా కథాంశంపై ఉన్న అవగాహన మేరకు ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుందన్న అంచనాల్లేవు. పవన్‌కు ఇది రీఎంట్రీ మూవీ కావడంతో విపరీతమైన రేట్లకు సినిమాను అమ్మి ఆ మేరకు రికవరీ లేక ఫ్లాప్ అనే ముద్ర వేసుకుంటుందేమో అన్నది అభిమానుల ఆందోళన. పవన్ మీద ఈ అంచనాల భారాన్ని పెట్టకుండా ఓ మోస్తరు లాభాలతో రాజు సినిమాను అమ్మి దీనికి ‘హిట్’ స్టేటస్ వచ్చేలా చూడాలన్నది అభిమానుల ఆకాంక్ష.

This post was last modified on February 10, 2021 12:05 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

2 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

3 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

3 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

3 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

5 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

5 hours ago