కోన వెంకట్.. ఒకప్పుడు రచయితగా వైభవం చూసిన ఈ వ్యక్తి కొన్నేళ్లుగా ప్రొడక్షన్‌కు పరిమితం అవుతున్నాడు. మంచి కాంబినేషన్లలో సినిమాలు సెట్ చేసి, అందుకు ప్రతిఫలంగా సినిమాలో వాటా పొందడం, ప్రొడక్షన్ చూసుకోవడం.. ఇలా నడుస్తోంది ఆయన కెరీర్. ‘నిశ్శబ్దం’ లాంటి ఒకట్రెండు సినిమాలకు మాత్రమే ఆయన గత కొన్నేళ్లలో రచన బాధ్యతలు తీసుకున్నారు. అది కూడా పూర్తి స్థాయిలో కాదు. రచయితగా కోన మార్కు చూసి చాలా కాలం అయిపోయింది. ఆయన్నో రచయితగానే గుర్తించట్లేదు ఈ మధ్య.
ఐతే చాలా గ్యాప్ తర్వాత ఓ భారీ చిత్రానికి కోన వెంకట్ రచన చేస్తున్నట్లు సమాచారం. అది మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్టు కావడం విశేషం. ఆయనతో కోన శిష్యుడు అనదగ్గ కె.ఎస్.రవీంద్ర (బాబీ) ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఇటీవలే ఆ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని అధికారికంగా ప్రకటించాడు మెగాస్టార్. ఈ చిత్రానికి స్క్రిప్టు పూర్తి కావస్తున్నట్లు సమాచారం. దీనికి కోన వెంకట్ రచనా సహకారం అందిస్తున్నాడట. అలాగే ‘పంతం’ సినిమాతో దర్శకుడిగా మారిన చక్రవర్తి కూడా ఈ సినిమాకు పని చేస్తున్నాడట. బాబీ ఇంతకుముందు చేసిన పవర్, జై లవకుశ సినిమాలకు కోన రచయితగా పని చేశాడు. బాబీ దర్శకుడిగా మారడంలో కోన సహకారం కూడా ఎంతో ఉంది. ఆయన్ని తన గురువులా భావిస్తాడు బాబీ.
వివిధ కారణాలతో గత కొన్నేళ్లలో రచన బాగా తగ్గించేసిన కోన.. చిరు సినిమాకు బాబీ విజ్ఞప్తి మేరకు స్క్రిప్టులో భాగమయ్యారట. ఐతే గతంతో పోలిస్తే కోన కలం పదును బాగా తగ్గిపోయినట్లు అనిపిస్తున్న నేపథ్యంలో చిరు సినిమాలో ఆయన ఏమాత్రం మెరుపులు మెరిపిస్తారో చూడాలి. ఈ సినిమాలో ఆయన రచన క్లిక్ అయితే మళ్లీ రైటర్‌గా బిజీ అవుతారేమో చూడాలి.
This post was last modified on February 10, 2021 10:57 am
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…
నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…