Movie News

బాలయ్యను, నిర్మాతను బయటపడేసిన బోయపాటి


నందమూరి బాలకృష్ణ మార్కెట్ ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నడూ లేనంతగా దిగజారిపోయింది గత రెండేళ్లలో. ముఖ్యంగా 2019 సంవత్సరం ఆయన్ని మామూలుగా దెబ్బ కొట్టలేదు. ఆ ఏడాది వచ్చిన ‘ఎన్టీఆర్: కథానాయకుడు’, ‘ఎన్టీఆర్: మహానాయకుడు’ చిత్రాలతో పాటు ‘రూలర్’ దారుణాతి దారుణ ఫలితాలందుకున్నాయి. అవి ఏ స్థాయిలో నష్టాలు తెచ్చిపెట్టాయి, ఎంత పెద్ద డిజాస్టర్లయ్యాయి అని ఇప్పుడు కొత్తగా చర్చించాల్సిన పని లేదు. అవి బాలయ్య మార్కెట్‌ను కూడా దారుణంగా దెబ్బ తీశాయి. ఈ స్థితి నుంచి బాలయ్య ఎలా కోలుకుంటాడా అని అందరూ సందేహించారు.

కానీ సరైన సమయంలో సరైన వ్యక్తితో జోడీ కట్టి బాలయ్య మార్కెట్ పరంగా పూర్వ వైభవం తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. తనకు సింహా, లెజెండ్ లాంటి బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన బోయపాటితో జట్టు కట్టడంతో బాలయ్యపై మళ్లీ ట్రేడ్‌కు బాగానే నమ్మకం కుదిరినట్లుంది.

బాలయ్య-బోయపాటి సినిమాకు రూ.55 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. వివిధ ఏరియాలకు దాదాపుగా బిజినెస్ క్లోజ్ అయిపోయిందట. అన్ని ఏరియాల్లోనూ బాలయ్య కెరీర్ హైయెస్ట్ రేట్లు పలికినట్లు తెలుస్తోంది. ‘ఎన్టీఆర్’; ‘రూలర్’ లాంటి డిజాస్టర్ల తర్వాత బాలయ్య సినిమాకు ఇంత హైప్ వచ్చి, ఇలా బిజినెస్ జరుగుతోందంటే అది బోయపాటితో అతడి కాంబినేషన్‌కున్న క్రేజ్ పుణ్యమే. ఈ సినిమాతో బాలయ్యనే కాదు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డిని కూడా కష్టాలనుంచి బయటపడేశాడట బోయపాటి.

ఇంతకుముందు బోయపాటితోనే ‘జయ జానకి నాయక’ తీశాడు రవీందర్. ఆ చిత్రానికి బెల్లంకొండ సురేష్ నుంచి ఆర్థిక సహకారం అందినప్పటికీ ఆయనకు నష్టాలు తప్పలేదు. ఆ సినిమాకు సంబంధించి ఫైనాన్స్ ఇంకా క్లియర్ చేయకపోవడంతో బాలయ్య-బోయపాటి సినిమాకు ఒక దశలోకాసుల కటకట ఎదురైందట. అలాంటి టైంలోనే ఈ సినిమాకు బిజినెస్ ఓపెన్ చేయడం, బయ్యర్లు అడ్వాన్సులు కట్టడంతో సినిమాకు ఫైనాన్స్ సమస్యలన్నీ తీరిపోయినట్లు సమాచారం.

This post was last modified on February 10, 2021 10:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నారా లోకేష్‌… కేటీఆర్‌ను ఓవ‌ర్ టేక్ చేశారా ..!

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్‌.. ఓక‌ప్పుడు తెలంగాణ మంత్రిగా ఉన్న బీఆర్ఎస్ వ‌ర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో…

36 minutes ago

గేమ్ చేసిన గాయం… రాజాతో మాయం

ఒక హీరోయిన్ నటించిన రెండు సినిమాలు ఒకే టైంలో విడుదల కావడంలో ఆశ్చర్యం లేదు కానీ చాలా విషయాల్లో వాటి…

1 hour ago

సంక్షోభానికి ఎదురీత.. ట్రంప్ ముందు స‌వాళ్లు ఎన్నెన్నో!!

అమెరికా నూత‌న అధ్య‌క్షుడిగా ప్ర‌మాణం చేసిన డొనాల్డ్ ట్రంప్‌.. త‌న హ‌యాంలో దేశానికి స్వ‌ర్ణ యుగం తీసుకువ‌స్తాన‌ని ప్ర‌క‌టిం చారు.…

2 hours ago

యష్ ‘టాక్సిక్’ చుట్టూ పర్యావరణ వివాదం

కెజిఎఫ్ తర్వాత యష్ నటిస్తున్న టాక్సిక్ కి చెట్టు కష్టాలు ఎక్కువయ్యాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది వాస్తవం. అదెలాగో…

2 hours ago

ఎట్టకేలకు ప్రక్షాళన: 27 ఐపీఎస్ లు.. 25 ఐఏఎస్ ల బదిలీలు

ముఖ్యమంత్రిగా అనుభవంతో పాటు.. ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎలా నడిపించాలన్న దాని గురించి ఎవరికైనా సలహాలు.. సూచనలు ఇవ్వొచ్చు కానీ నారా…

2 hours ago

భరత్ ‘సీఎం’ వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్

ఉత్సాహం మంచిదే కానీ సమయం.. సందర్భం చూసుకోవాలి. అదేమీ లేకుండా కూటమి సర్కారుకు ఉన్న సున్నిత అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా…

3 hours ago