చంద్రశేఖర్ యేలేటి లాంటి విలక్షణ దర్శకుడి దగ్గర శిష్యరికం చేసి.. ‘అందాల రాక్షసి’ లాంటి విభిన్నమైన సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు హను రాఘవపూడి. తొలి సినిమాతోనే మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ.. ఇప్పటిదాకా నిఖార్సయిన కమర్షియల్ హిట్ మాత్రం ఇవ్వలేకపోయాడు హను.
ఉన్నంతలో ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ఓ మోస్తరు ఫలితం అందుకుంది కానీ.. ఆ తర్వాత అతణ్ని నమ్మి భారీ బడ్జెట్లలో తీసిన ‘లై’, ‘పడి పడి లేచె మనసు’ సినిమాలు దారుణమైన ఫలితాలందుకుని నిర్మాతల్ని ముంచేశాయి. ముఖ్యంగా ‘పడి పడి..’తో హనుకు చాలా చెడ్డ పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత అతడికి అవకాశాలు రావడం కష్టమే అనుకున్నారంతా. కానీ వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద సంస్థలో అతడికి తర్వాతి సినిమా చేసే అవకాశం వచ్చినట్లు కొన్ని రోజుల కిందట ప్రచారం జరిగింది.
ఈ వార్త నిజమే అంటూ వైజయంతీ అధినేత అశ్వినీదత్ ధ్రువీకరించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా దత్ తన సంస్థలో తెరకెక్కనున్న కొత్త సినిమాల గురించి చెప్పుకొచ్చారు. ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమాతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా ఉంటుందని ఆయన వెల్లడించారు.
నందిని రెడ్డి సైతం ఓ కథను రెడీ చేస్తోందని.. ఆ సినిమా కూడా త్వరలోనే ఓకే అవుతుందని ఆయన చెప్పారు. ఐతే హను లాంటి దర్శకుడిని నమ్మి దత్ అవకాశం ఇవ్వడం విశేషమే. ఆయన కూతుళ్లు స్వప్న, ప్రియాంకలకు యంగ్ డైరెక్టర్లపై మంచి గురి ఉంది.
హను టాలెంటెడ్ అన్న విషయం అందరికీ తెలుసు కానీ.. ఒక సంపూర్ణమైన, సంతృప్తికర సినిమాను డెలివర్ చేయలేడన్న విమర్శలున్నాయి. సక్సెస్ రేట్ చాలా దారుణంగా ఉన్నప్పటికీ వైజయంతీ లాంటి సంస్థలో అవకాశం దక్కడం ఆశ్చర్యమే. ఈ అవకాశాన్ని అతను ఉపయోగించుకోకపోతే అతడి కెరీర్ ముగిసినట్లే. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తారని సమాచారం.
This post was last modified on May 7, 2020 8:16 pm
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…