సంక్రాంతికి నాలుగు మీడియం రేంజ్ సినిమాలతో కళకళలాడింది టాలీవుడ్ బాక్సాఫీస్. అందులో మూడు మంచి ఫలితాన్నందుకున్నాయి. ముఖ్యంగా ‘క్రాక్’ బ్లాక్‌బస్టరే అయింది. రూ.35 కోట్లకు పైగా ఆ చిత్రం షేర్ రాబట్టింది. ఐతే అందులో సగం మొత్తానికే ‘క్రాక్’ థియేట్రికల్ హక్కులు అమ్ముడవడం గమనార్హం. రవితేజ చేసిన గత నాలుగు సినిమాలూ డిజాస్టర్లు కావడం, సంక్రాంతికి మరో మూడు సినిమాలతో పోటీ పడటం, అలాగే అప్పటికి 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడుస్తుండటంతో మాస్ రాజా స్థాయికి తగ్గట్లుగా ఈ చిత్రానికి బిజినెస్ జరగలేదు.
ఐతే ఇప్పుడు వేలంటైన్స్ డే వీకెండ్లో రిలీజవుతున్న ‘ఉప్పెన’ సినిమాకు ‘క్రాక్’ను మించి థియేట్రికల్ బిజినెస్ జరగడం విశేషం. కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త దర్శకుడు కలిసి చేసిన ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను దాదాపు రూ.22 కోట్లకు అమ్మినట్లు సమాచారం. 2021లో ఇప్పటిదాకా అత్యధిక బిజినెస్ చేసిన చిత్రం ఇదే కావడం విశేషం.
‘ఉప్పెన’ పాటల్లో ప్రతిదీ సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకోవడం, టీజర్, ట్రైలర్, ఇతర ప్రోమోలన్నీ ఆకట్టుకోవడంతో ‘ఉప్పెన’కు మంచి హైపే వచ్చింది. ఇటీవల ఆ హైప్ మరింత పెరిగింది. ఈ చిత్రాన్ని ఓటీటీలకు ఇచ్చేయకుండా ఆపి మంచి పనే చేశారు. మంచి టైమింగ్ చూసి రిలీజ్ చేస్తుండటం కూడా కలిసొస్తోంది. అందుకే ట్రేడ్ నుంచి మంచి డిమాండే ఉన్నట్లు తెలుస్తోంది. కోస్తాంధ్ర హక్కులు మాత్రమే రేషియో పద్ధతిలో రూ.10 కోట్లకు అమ్ముడయ్యాయంటే ‘ఉప్పెన’ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మిగతా ఏరియాల్లోనూ మంచి రేట్లే పలికాయి.
ఐతే ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ నెలలో ఓ కొత్త హీరో సినిమా రూ.22 కోట్ల షేర్ రాబట్టడం అంటే అంత తేలిక కాదు. వైష్ణవ్ ముందు పెద్ద టార్గెట్ ఉన్నట్లే. ఐతే సినిమాకున్న హైప్ వల్ల ఓపెనింగ్స్‌కు ఢోకా ఉండవనే భావిస్తున్నారు. సంక్రాంతి సినిమాల తర్వాత మూడు వారాలు బాక్సాఫీస్ వెలవెలబోవడం, పెద్దగా పోటీ లేకుండా రిలీజవుతుండటం ‘ఉప్పెన’కు కలిసొచ్చే అంశాలు. మరి ఇన్ని పాజిటివ్స్ మధ్య రిలీజవుతున్న ‘ఉప్పెన’ బాక్సాపీస్ దగ్గర ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి.
This post was last modified on February 9, 2021 1:57 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…