‘సాహో’ సినిమా విషయంలో జనాల నుంచి వినిపించిన పెద్ద కంప్లైంట్ మ్యూజిక్కే. ముందు ఈ సినిమాకు శంకర్-ఎహ్‌సాన్-లాయ్‌లను సంగీత దర్శకులుగా ఎంచుకున్నారు. కానీ మధ్యలో ఏమైందో ఏమో వాళ్లు ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. సినిమా ఇంకో మూడు నెలల్లో విడుదల కాబోతుండగా ఈ చిత్రానికి మ్యూజిక్ ఎవరు చేస్తున్నారో తెలియని పరిస్థితి. విపరీతమైన సస్పెన్స్ తర్వాత.. హడావుడిగా ఐదుగురు సంగీత దర్శకులను తీసుకుని ఒక్కొక్కరితో ఒక్కో పాట చేయించుకున్నారు. జిబ్రాన్ ఆర్ఆర్ సమకూర్చాడు. దీంతో మ్యూజిక్ పరంగా పెద్ద కంగాళీ అయింది. సినిమాకు అది మైనస్సే అయ్యింది.
ప్రభాస్ కొత్త సినిమా ‘రాధేశ్యామ్’ విషయంలోనూ యువి క్రియేషన్స్ వాళ్లు ఇలాగే చేస్తున్న సంకేతాలు కనిపించాయి ముందు. సినిమా పూర్తవుతున్న దశలో కూడా సంగీత దర్శకుడిని ఖరారు చేయలేదు. ఐతే కొన్ని నెలల కిందటే ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ జస్టిన్ ప్రభాకరన్‌కు ఆ బాధ్యత అప్పగిస్తున్నట్లు ప్రకటన వచ్చింది.
ఇంతటిలో సస్పెన్సుకు తెరపడిందని.. అతనే పాటలు, నేపథ్య సంగీతం అందిస్తాడని అంతా ఓ నిర్ణయానికి వచ్చారు. కానీ ఇప్పుడు ఈ విషయంలో ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు సమాచారం. జస్టిన్ సినిమాలో అన్ని పాటలూ చేయట్లేదట. నేపథ్య సంగీతం బాధ్యత కూడా అతడిది కాదట. బాలీవుడ్లో హాఫ్ గర్ల్ ఫ్రెండ్, సనమ్ రే, శివాయ్, బాగి-2 లాంటి చిత్రాలకు సంగీతం సమకూర్చిన మిథూన్‌తో ఈ సినిమాకు వర్క్ చేయించుకుంటున్నారట.
జస్టిన్ మాత్రమే అయితే ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌తో పాటు నేపథ్య సంగీత బాధ్యతలను మిథూన్‌కు అప్పగించినట్లు సమాచారం. ఐతే ‘సాహో’ అనుభవం నేపథ్యంలో ఇది మన జనాలకు అంతగా రుచించే విషయం కాదు. మరోసారి మ్యూజిక్‌ను కంగాళీ చేస్తారేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి యువి వాళ్ల ఉద్దేశమేంటో? ఫిబ్రవరి 14న ‘రాధేశ్యామ్’ టీజర్ రిలీజ్ కానుండగా.. జులై 30న సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on February 9, 2021 9:49 am
ఓవైపు నందమూరి వారసుడు మోక్షజ్ఞ అరంగేట్రానికి రంగం సిద్ధమవుతుండగా.. ఆ తర్వాత మోస్ట్ అవైటెడ్ డెబ్యూ అంటే అకీరా నందన్దే.…
టాలీవుడ్లో సంగీత దర్శకుడు భీమ్స్ది ఎంతో ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయక ప్రయాణం. పేద కుటుంబానికి చెందిన అతను.. యుక్త వయసులో పడ్డ…
ఏపీలో కూటమిగా ఉన్న టీడీపీ-బీజేపీ మధ్య సఖ్యత బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో కొన్ని కొన్ని నియోజక వర్గాల్లో చోటు చేసుకుంటున్న…
ప్రగతి రథం రైలు బండి పోతున్నాది.. అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాడుకుంటున్నారు. ఏడాది పాలనలో తెలంగాణలో సీఎం రేవంత్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ను…
ప్రస్తుతం పెద్ద సినిమాల్లో ప్రత్యేక అతిథి పాత్రలను క్రియేట్ చేసి పేరున్న నటులతో వాటిని చేయించడం ట్రెండుగా మారింది. ఈ…