నందమూరి బాలకృష్ణ ఓ పెద్ద పెద్ద సాహసానికి సిద్ధమయ్యాడు. ఏ హీరో కూడా ఊహించలేని అవతారంలోకి బాలయ్య మారినట్లు సమాచారం. ఆయన అఘోరా గెటప్ వేసేసుకున్నారట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో ఆయన అఘోరాగా కనిపించనున్నట్లు గత ఏడాదే వార్తలొచ్చాయి. బోయపాటి సైతం ఈ దిశగా సంకేతాలు ఇచ్చాడు. ఐతే ఆ గెటప్ వేయడంలో ఆలస్యం జరిగింది.
ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న బోయపాటి సినిమా చిత్రీకరణలో భాగంగా బాలయ్య ఈ గెటప్ వేసినట్లు సమాచారం. ఆ పాత్రలోనే ఆయన ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో పాల్గొంటున్నారట. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో ఆ యాక్షన్ ఘట్టం చిత్రీకరిస్తున్నారు. సినిమాలో ఈ గెటప్, దీంతో ముడిపడ్డ సన్నివేశాలు షాకింగ్‌గా ఉంటాయని, చిత్రానికే పెద్ద హైలైట్ అవుతాయని అంటున్నారు.
అఘోరాగా బాలయ్య అనగానే ప్రేక్షకులకు రకరకాల ఊహలు వస్తున్నాయి. ఎంత కమర్షియల్ టచ్ ఇచ్చినా కూడా ఓ స్టార్ హీరోను అలాంటి పాత్రలో చూడటం షాకింగ్‌గానే అనిపిస్తుంది. మరి హీరోను అలా చూపించడానికి కథలో ఎలా స్కోప్ దొరికిందన్నది ఆసక్తికరం. సినిమా రిలీజ్ కంటే ముందు ఈ లుక్‌ను బయటపెడతారా.. లేకా సస్పెన్సులా దాచి పెడతారా అన్నది చూడాలి. మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా దీని టైటిల్ కూడా రివీల్ చేయలేదు.
ఫస్ట్ లుక్ మాత్రం లాంచ్ చేశారు. అందులో బాలయ్య సూపర్ స్టైలిష్‌గా కనిపించాడు. త్వరలోనే టైటిల్‌తో పాటు టీజర్ కూడా ఒకేసారి విడుదల చేస్తారని అంటున్నారు. ‘జయ జానకి నాయక’ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఓ కథానాయికగా ప్రగ్యా జైశ్వాల్ నటిస్తోంది. తమన్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నాడు.
This post was last modified on February 9, 2021 10:41 pm
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…