ఉప్పెన.. ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో ఈ సినిమా గురించి చర్చలన్నీ. పది నెలల ముందు విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా దెబ్బకు పది నెలలు ఆలస్యంగా ఈ నెల 13న విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే.. ఒక పెద్దింటి అమ్మాయి, ఒక పేదింటి కుర్రాడు ప్రేమలో పడితే.. అమ్మాయి తండ్రి అడ్డం పడటం.. ఈ క్రమంలో ఆ జంట పడే కష్టాలు.. చివరికి వాళ్లిద్దరి ప్రేమ నిలబడిందా లేదా అనే నేపథ్యంలో సినిమా నడిచేలా కనిపించింది. ఈ కోవలో వందల్లో సినిమాలు వచ్చాయి. కొత్తగా ‘ఉప్పెన’లో ఏం చూపించారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సినిమాలో లవ్ ఫీల్, ఎమోషన్లకు ఢోకా లేనట్లే కనిపించింది, సాంకేతిక ఆకర్షణలు బాగానే తోడైనట్లూ అనిపించింది.
కానీ ఇంకేదో బలమైన పాయింట్ లేకుండా ఈ సినిమాకు చిరు సహా మెగా ఫ్యామిలీ ఆమోద ముద్ర వేసేది కాదు. మైత్రీ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ అంత ఖర్చు పెట్టి సినిమా తీసేది కాదు. సుకుమార్ ఈ ప్రాజెక్టుకు అండగా నిలిచేవాడు కాదు. అన్నింటికీ మించి విజయ్ సేతుపతి లాంటి మేటి నటుడు ఈ సినిమాలో నటించేవాడు కాదు. ఈ నేపథ్యంలో ‘ఉప్పెన’లోని ఆ స్పెషల్ పాయింట్ ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. ఐతే ఇండస్ట్రీలో ఆ పాయింట్ ఏంటన్నది ఆల్రెడీ లీక్ అయినట్లే చెబుతున్నారు. తన కూతురిని ప్రేమించాడన్న కోపంతో విజయ్ సేతుపతి హీరోకు చేసిన నష్టం ఏంటి అన్నది ఆ పాయింట్ అని సమాచారం.
‘ఉప్పెన’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. ‘డేంజర్ పాయింట్’ అని పేర్కొన్నది దాని గురించి. అలాగే ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ వంగ సైతం ఇన్‌డైరెక్ట్‌గా ఆ పాయింట్ గురించి మాట్లాడాడు. ఇలాంటి ఐడియా తనకెందుకు రాలేదా అనిపించిందన్నాడు. సుకుమార్ సైతం ఆ పాయింట్ గురించి చూచాయిగా చెప్పాడు. సినిమాలో ప్రేక్షకులను ఆ పాయింట్ షాక్‌కు గురి చేస్తుందని, ఒకప్పటితో పోలిస్తే తెలుగు ప్రేక్షకుల అభిరుచి ఎంతో మారి, ప్రయోగాలకు చేయూతనిస్తున్న నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు ధైర్యంగా ఈ పాయింట్‌ను డీల్ చేశాడని, అతడికి అందరూ సపోర్ట్ ఇచ్చారని తెలుస్తోంది.
This post was last modified on February 8, 2021 8:16 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…