Movie News

రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్?

టాలీవుడ్లో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న అన్ని సినిమాల రిలీజ్ డేట్లూ దాదాపు ఖరారైపోయాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి రావాల్సిన ‘సర్కారు వారి పాట’ సైతం ఇప్పుడే రిలీజ్ టైం ఫిక్స్ చేసుకుంది. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’, ‘పుష్ప’ లాంటి భారీ చిత్రాలకూ రిలీజ్ డేట్ ఖరారైంది. కానీ ఒక్క ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’ విషయంలోనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. కానీ దీని విడుదల ఎప్పుడు అన్నది మేకర్స్ చెప్పట్లేదు.

ఐతే ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవ కానుకగా ‘రాధేశ్యామ్’ టీజర్ రిలీజ్ చేస్తున్న చిత్ర బృందం.. అప్పుడే రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తుందనే అంచనాలున్నాయి. కాగా ఈ సినిమా ఎప్పుడు విడుదల కావచ్చనే విషయంలో టాలీవుడ్లో ఓ ఆసక్తికర ప్రచారం నడుస్తోంది.

ముందు వేసవికే అనుకున్నప్పటికీ అప్పటికి సినిమాను విడుదల చేయడం కష్టమే అనుకుంటున్నారట. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాల్సి ఉన్న నేపథ్యంలో అన్ని వెర్షన్లనూ మంచి క్వాలిటీతో రిలీజ్ చేయడానికి సమయం పడుతుందని.. అందుకే ఈ చిత్రాన్ని జులైకి వాయిదా వేశారని సమాచారం. ఆ నెల 30న ‘రాధేశ్యామ్’ విడుదలవుతుందని అంటున్నారు. వేసవికి ఈ సినిమాను మేలో నెలాఖర్లో విడుదల చేస్తే బాగుంటుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి కానీ.. అందుకు అవకాశం లేదని తేలింది.

జూన్‌‌లో స్కూళ్లు, కాలేజీలు తెరుచుకునే సమయం కాబట్టి అప్పుడు ఈ సినిమాను విడుదల చేయాలనుకోవట్లేదు. జులైలో బాక్సాఫీస్ మళ్లీ ఊపందుకుంటుంది. ఐతే ఆ నెల 19కి ఆల్రెడీ ‘కేజీఎఫ్-2’ ఫిక్సయింది. అక్కడి నుంచి 11 రోజులు గ్యాప్ తీసుకుని 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారట. ఇండిపెండెన్స్ డే వీకెండ్‌కు ‘పుష్ప’ ఉంది కాబట్టి మధ్యలో ఉన్న ఖాళీలో ‘రాధేశ్యామ్’ కోసం బుక్ చేసినట్లు తెలుస్తోంది.

This post was last modified on February 7, 2021 6:05 pm

Share

Recent Posts

249 కొట్టినా గెలవలేని టీం ఇండియా

టీ20 మ్యాచ్‌లో 249 పరుగులు చేస్తే గెలుపు దాదాపు ఖాయమని అనుకుంటాం. కానీ వెస్టిండీస్ బ్యాటర్లు ఆ అంచనాలను తలకిందులు…

3 minutes ago

బ్లాక్ బస్టర్ మనకెందుకు నచ్చడం లేదంటే

కన్నడలో గత నెల 25 ప్యారడైజ్ తో పాటుగా విడుదలైన ప్రేమద ఊరల్లీ భీభత్సమైన కలెక్షన్లతో కర్ణాటకలో అదరగొడుతోంది. రెండో…

52 minutes ago

అష్ట‌దిగ్భంధ‌నంలో దేశ రాజధాని

వైద్య విద్య ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీక్‌కు సంబంధించి కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేసిన నిర‌స‌న…

2 hours ago

తెలంగాణ హీరో రాయలసీమ యాస పేలిందా

ఒక ప్రాంతానికి సంబంధించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీసేటప్పుడు యాస విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైలాగులు రాయడం…

3 hours ago

కొత్త ప్రభుత్వాలు బలంగానే ఉన్నాయి

తాజాగా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న పార్టీలే హ‌వా చూపించాయి.…

3 hours ago

బీసీ రిజర్వేషన్ల విషయంలో తగ్గేదెలే అంటున్న చంద్రబాబు

బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…

4 hours ago