నితిన్‌కి ఓవర్సీస్ మార్కెట్ కాస్త బాగానే ఉంటుంది. ఎందుకంటే… తనది ఫన్, రొమాంటిక్ జోనర్. ఇలాంటి కథలు.. ఓవర్సీస్ ప్రేక్షకులకు ఈజీగా నచ్చేస్తాయి. అఆ
, భీష్మ
లాంటి సినిమాలతో అక్కడి మార్కెట్ ని మరింత పెంచుకున్నాడు నితిన్. రంగ్ దే
మీద కూడా బాగానే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాని ఓవర్సీస్‌లో మంచి రేటుకి అమ్మాలని చూస్తున్నారు నిర్మాతలు.
అయితే.. ఓవర్సీస్ మార్కెట్ ఇప్పుడు డీలాగా ఉంది. అమెరికా వసూళ్లపై ఆశలు పెట్టుకునే అవకాశమే లేదు. టోటల్ గా ఓవర్సీస్ మార్కెట్ ఢమాల్. కాకపోతే.. రంగ్ దే
ఓవర్సీస్ రూపంలో కనీసం 2 కోట్లు రాబట్టాలన్నది నిర్మాతల ప్రయత్నం. కానీ.. అంత పలకడం లేదు. కోటి, కోటిన్నర అంటూ బేరాలు తీస్తున్నారు బయ్యర్లు.
ఇంకాస్త రేటు పలికితే.. ఈ డీల్ క్లోజ్ చేయాలని.. నిర్మాతలు భావిస్తున్నారు. మార్చి 26న రంగ్ దే
ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.