Movie News

థియేటర్ వెర్సస్ ఓటీటీ.. గొడవ పెద్దదే

థియేటర్లు మూత పడ్డ లాక్ డౌన్ టైంలో కొత్త సినిమాలను నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేసేశారు నిర్మాతలు. దీనిపై థియేటర్ల యాజమాన్యాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ.. అవసరాలను బట్టి తమ సినిమాలను ఎక్కడ, ఎలా రిలీజ్ చేసుకోవాలన్నది తమ ఇష్టమన్నట్లుగా మాట్లాడారు నిర్మాతలు. ఐతే థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని చూసి చూసి ఇక తప్పక కొందరు నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలకు ఇచ్చేసిన మాటా వాస్తవం.

ఐతే ఇప్పుడు థియేటర్లు తెరుచుకున్నాయి. వాటిలో బాగా ఆడుతున్న సినిమాలను పెద్దగా గ్యాప్ ఇవ్వకుండానే ఓటీటీల్లో రిలీజ్ చేసేస్తుండటం ఎగ్జిబిటర్లకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. సంక్రాంతికి వచ్చిన తమిళ సినిమా ‘మాస్ట‌ర్’ థియేట‌ర్ల‌లో విడుద‌లైన రెండు వారాల‌కే అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ‘క్రాక్’ మూవీ సైతం మూడు వారాల్లోపే ఆహాలోకి రావాల్సింది. కానీ ఆ సినిమా థియేట‌ర్ల‌లో బాగా ఆడుతుండ‌టంతో ఒక వారం ఆల‌స్యంగా, ఫిబ్ర‌వ‌రి 5న ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.

ఒకప్పుడు థియేటర్లలో విడుదలైన రెండు మూడు నెలల తర్వాత ఓటీటీల్లోకి వచ్చేవి కొత్త సినిమాలు. తర్వాత ఆ గ్యాప్ నెలన్నరకు, ఆపై నెల రోజులకు తగ్గింది. కానీ ఇప్పుడు రెండు మూడు వారాలకే కొత్త సినిమాలను ఓటీటీలకు ఇచ్చేస్తున్నారు. ఇలా థియేట్రిక‌ల్ రిలీజ్‌కు, డిజిట‌ల్ రిలీజ్‌కు గ్యాప్ మ‌రీ త‌గ్గిపోతుండ‌టం ప‌ట్ల ఎగ్జిబిట‌ర్ల‌లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అస‌లే క‌రోనా ధాటికి థియేట‌ర్ల వ్య‌వ‌స్థ దారుణంగా దెబ్బ తింద‌ని, ఇప్పుడు ఇలా కొత్త సినిమాలు థియేట‌ర్ల‌లో ఆడుతుండ‌గానే ఓటీటీల్లో రిలీజ్ చేస్తే త‌మ ప‌రిస్థితి ఏంట‌ని వారు గగ్గోలు పెడుతున్నారు.

ఇదే విష‌య‌మై నిర్మాతలతో తాడో పేడో తేల్చుకోవాలని నిశ్చయించుకున్న ఎగ్జిబిటర్లు.. బుధవారం రామానాయుడు స్టూడియోలో నిర్మాతలతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌లో డిస్ట్రిబ్యూటర్లు సైతం పాల్గొన్నారు. ఈ సమావేశం వాడి వేడిగానే సాగినట్లు సమాచారం. నిర్మాతల తీరును తీవ్రంగా తప్పుబట్టిన ఎగ్జిబిటర్లు ఇలా అయితే థియేటర్లను నడపలేమని తేల్చేశారట. ఇకపై పెద్ద సినిమా అయితే థియేటర్లలో విడుదలైన 6 వారాల తర్వాత చిన్న సినిమా అయితే 4 వారాల తర్వాత ఓటీటీల్లో విడుదల కావాలని తేల్చి చెప్పారని.. అలాగే మల్టీప్లెక్సుల మాదిరే సింగిల్ స్క్రీన్లకు కూడ పర్సంటేజ్ విధానం ఉండాలని డిమాండ్ చేశారని తెలిసింది. ఈ షరతులకు అంగీకరించకపోతే మార్చి 1 నుంచి థియేటర్లు మూసేస్తామని అల్లిమేటం విధించినట్లు సమాచారం. దీనిపై నిర్మాతలు ఏమంటారో చూడాలి.

This post was last modified on February 4, 2021 3:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

19 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

1 hour ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago