Movie News

తనపై మీమ్స్‌ను షేర్ చేసిన హీరోయిన్

తమపై సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్‌ను ఫిలిం సెలబ్రెటీలు చాలామంది పెద్దగా పట్టించుకోరు. కొంత మంది వీటికి అఫెండ్ అవుతారు కూడా. కానీ కొందరు మాత్రం వాటిని స్పోర్టివ్‌గా తీసుకుంటారు. ఎంజాయ్ చేస్తారు. వాటి మీద సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు కూడా. ప్రస్తుతం సౌత్‌ ఫిలిం ఇండస్ట్రీలో హ్యాపెనింగ్ బ్యూటీ అనదగ్గ మాళవిక మోహనన్ కూడా ఇదే బాటలో నడిచింది. ‘మాస్టర్’ సినిమా విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ భామ హావభావాలతో బోలెడన్ని మీమ్స్ తయారవుతున్నాయి.

‘మాస్టర్’ ఇంటర్వెల్ ముంగిట హీరో మీద మాళవిక తీవ్ర ఆక్రోశాన్ని చూపించే సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశంలో మాళవిక చక్కటి హావభావాలు పలికించింది. ఆ స్క్రీన్ షాట్లు తీసి మీమ్స్ మోత మోగిస్తున్నారు నెటిజన్లు. మాళవిక బ్రష్ చేస్తున్నట్లు, సెంటర్ ఫ్రెష్ నోట్లో వేసుకుని నములుతున్నట్లు, బీర్ తాగుతున్నట్లు, పాల ప్యాకెట్‌ను నోటితో కొరుకుతున్నట్లు ఇలా రకరకాల మీమ్స్ తయారయ్యాయి. ఇవి మాళవిక దృష్టికి వచ్చి ఆమె స్వయంగా తనపై వచ్చిన కొన్ని మీమ్స్ షేర్ చేసింది.

తాను కొంచెం ఆలస్యంగా ఈ మీమ్స్ చూశానని, అందులో తనకు నచ్చినవి షేర్ చేస్తున్నానని, ఇందులో ముఖ్యంగా తాను బ్రష్ చేస్తున్నట్లుగా ఉన్న మీమ్ చూసి పగలబడి నవ్వానని ఆమె చెప్పింది. మనల్ని చూసి మనం నవ్వుకోకుంటే జీవితం చాలా బోర్ కొట్టేస్తుందని కూడా ఆమె వ్యాఖ్యానించింది. మాళవిక తన మీమ్స్‌పై ఇంత స్పోర్టివ్‌గా స్పందించడం ఆమె ఫాలోవర్లను ఆకట్టుకుంది. ఆమె మీద వచ్చిన మరిన్ని మీమ్స్ తీసి కామెంట్ల రూపంలో పోస్ట్ చేస్తున్నారు. ‘మాస్టర్’కు భారీ విజయాన్నందుకున్న మాళవిక ప్రస్తుతం ధనుష్ సరసన కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది.

This post was last modified on February 3, 2021 4:12 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

వీరమల్లు నిర్మాతకు గొప్ప ఊరట

ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…

11 mins ago

ఇళయరాజాకు ఇది తగునా?

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…

1 hour ago

నా రెండో సంత‌కం ఆ ఫైలు పైనే: చంద్ర‌బాబు

కూట‌మి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంత‌కం.. మెగా డీఎస్సీపైనేన‌ని.. దీనివ‌ల్ల 20 వేల మంది నిరుద్యోగుల‌కు మేలు…

1 hour ago

పదిహేనేళ్ల మాట తీర్చిన SSMB 29

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి షూటింగ్ స్టార్ట్…

2 hours ago

కేసీఆర్‌కు గ‌ట్టి షాక్‌.. ప్ర‌చారంపై నిషేధం

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు భారీ షాక్ త‌గిలింది. కీల‌కమైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల స‌మ‌యం లో…

3 hours ago

నాని కోసం.. ఆ దర్శకుడి క్రేజీ ప్లాన్

న్యాచురల్ స్టార్ నాని డిమాండ్ మాములుగా లేదు. ఊర మాస్ దసరా చేసినా, ఎమోషనల్ హాయ్ నాన్నగా వచ్చినా హిట్టుకు…

4 hours ago