అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో ‘బంగార్రాజు’ సినిమా గురించి చర్చ ఈనాటిది కాదు. ఐదేళ్ల కిందట ‘సోగ్గాడే చిన్నినాయనా’ సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్నందుకున్న కొన్ని రోజులకే ఆ చిత్రంలో ప్రధాన పాత్రను ఆధారంగా చేసుకుని ‘బంగార్రాజు’ సినిమా తీసే విషయమై చర్చ మొదలైంది. ఈ సినిమా స్క్రిప్టు మీద దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఏళ్లకు ఏళ్లు కష్టపడ్డాడు. కానీ స్క్రిప్టుకు పచ్చ జెండా ఊపి సెట్స్ మీదికి తీసుకెళ్లే విషయంలో మాత్రం నాగార్జున బాగా ఆలస్యం చేశాడు. ఇదిగో అదిగో అనుకుంటూనే చాలా ఏళ్లు గడిచిపోయాయి.
ఐతే ఎట్టకేలకు నాగ్ పచ్చ జెండా ఊపేశాడని, త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతోందని వార్తలొస్తున్నాయి. ఐతే ఈ చిత్రంలో ముందు నుంచి అనుకుంటున్నట్లు నాగచైతన్య నటించబోవట్లేదని తాజాగా వార్తలు వస్తుండటం గమనార్హం.
‘బంగార్రాజు’లో తాను నటిస్తానని ఇంతకుముందు స్వయంగా చైతూనే ధ్రువీకరించాడు. ఐతే అతను ఖాళీగా ఉన్న సమయంలో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు చైతూ చాలా బిజీ అయిపోయాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్ యు’ సినిమా చేస్తున్నాడు. వేరే కమిట్మెంట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ‘బంగార్రాజు’ షెడ్యూల్స్‌కు అనుగుణంగా డేట్లు ఇవ్వలేని స్థితిలో ఉన్నాడట. నాగ్ ఏమీ చైతూనే ఈ సినిమాలో నటించాలని పట్టుబట్టడం లేదట. వేరే యువ కథానాయకుడిని తీసుకుంటే సినిమాకు కొంచెం భిన్నమైన లుక్ కూడా వస్తుందని ఆలోచిస్తున్నాడట.
చైతూ కోసం అనుకున్న పాత్రకు రామ్ లేదా నాగశౌర్యను తీసుకోవాలనుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. మీడియాలో కూడా దీనిపై వార్తలొస్తున్నాయి. ఇదెంత వరకు నిజమో చూడాలి. నాగ్ చివరగా ‘వైల్డ్ డాగ్’ సినిమాలో నటించాడు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా రిలీజ్ కానుంది. త్వరలోనే ‘బంగార్రాజు’ చిత్రీకరణను నాగ్ మొదలుపెట్టనున్నాడట. ఆ తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది అక్కినేని హీరో.
This post was last modified on February 3, 2021 3:55 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…