పెళ్ళిచూపులు’ సినిమాతో టాలీవుడ్లోకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. తెలుగు వారినే కాక ఇతర భాషల వాళ్లనూ ఆకట్టుకున్న ఆ సినిమా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. మరెన్నో కొత్త కథలకు దారి చూపించింది. దీని తర్వాత తరుణ్ ఎలాంటి సినిమాలు తీస్తాడన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కానీ ‘పెళ్ళిచూపులు’ విడులయ్యాక నాలుగున్నరేళ్లలో తరుణ్ నుంచి ఒకే సినిమా వచ్చింది. ‘ఈ నగరానికి ఏమైంది’ పేరుతో తెరకెక్కిన ఆ సినిమా కూడా అనుకున్నంతగా ఆడలేదు.
‘పెళ్ళిచూపులు’ చిత్రాన్ని విడుదల చేసిన సురేష్ ప్రొడక్షన్స్‌లోనే తరుణ్ ఓ పెద్ద సినిమా చేస్తాడని, అందులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తాడని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ‘పెళ్ళిచూపులు’ తర్వాత తరుణ్ తీయాల్సిన సినిమా కూడా అదే. కానీ ఆ సినిమాపై ఎంతకీ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఇలాగే నాలుగేళ్లకు పైగా గడిచిపోయాయి.
ఐతే ఎట్టకేలకు తరుణ్-వెంకీ కలయికలో సినిమాకు అన్ని అడ్డంకులూ తొలగిపోయి అతి త్వరలోనే అది పట్టాలెక్కబోతోందని సమాచారం. గుర్రపు పందేల నేపథ్యంలో సాగే ఈ సినిమాకు నిర్మాత సురేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. స్క్రిప్టు ఓకే అయిందని, ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. మే లేదా జూన్‌లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం.
ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్స్‌లో ‘నారప్ప’ సినిమాను పూర్తి చేశాడు వెంకీ. ఈ సినిమా మే 14న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అది పూర్తి కాగానే ‘ఎఫ్-3’ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు ఈ సీనియర్ హీరో. అది మే-జూన్ మధ్య పూర్తవుతుందని అంటున్నారు. ఆ చిత్రం ఆగస్టు 27న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ‘ఎఫ్-3’ అవ్వగానే తరుణ్ సినిమా మీదికి వెళ్లిపోతాడు వెంకీ. ఈ ఏడాదే ఈ సినిమా కూడా పూర్తయ్యే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల ఉండొచ్చేమో.
This post was last modified on February 1, 2021 4:40 pm
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఈ క్రమంలో రేవతి అనే…
ఏపీ సీఎం చంద్రబాబు సహా కూటమి సర్కారు అమరావతిని పరుగులు పెట్టించేందుకు రెడీ అయింది. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ రాజధానిపైనే చేస్తున్నారు.…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…