నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాకు రిలీజ్ డేట్ ఖరారైంది. ఆదివారం టాలీవుడ్ సర్కిల్స్‌లో ఇదే హాట్ టాపిక్. కాకపోతే దాన్ని బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమాగానే సంబోధించాల్సి వస్తోంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో ఇది మూడో సినిమా కావడంతో దీన్ని బీబీ3 అని కూడా పేర్కొంటున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ లుక్ వదిలారు. దాంతో పాటు రిలీజ్ డేట్ కూడా చెప్పారు.కానీ ఇప్పటికీ టైటిల్ మాత్రం ఖరారు చేయకపోవడం ఆశ్చర్యమే.
ఇంతకుముందు వీళ్లిద్దరి కలయికలో వచ్చిన రెండు సినిమాలకు చాలా ముందుగానే టైటిల్స్ ఖరారయ్యాయి. సింహా, లెజెండ్ అనే ఆ పవర్ ఫుల్ టైటిల్స్ వేగంగా జనాల్లోకి వెళ్లిపోయాయి. కానీ తమ కలయికలో కొత్త సినిమా విడుదల ఖరారయ్యాక కూడా పేరు పెట్టలేదు.
ఆదివారం రిలీజ్ డేట్ అప్‌డేట్ అన్నపుడే ఫస్ట్ లుక్, టైటిల్ కూడా రివీల్ అవుతుందని అభిమానులు ఆశించారు. కానీ బాలయ్య స్టైలిష్ ఫస్ట్ లుక్ అయితే వదిలారు కానీ.. పేరు మాత్రం పెట్టలేదు. బీబీ3 అని సంబోధిస్తూనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మరి ఇంకా ఈ సినిమా టైటిల్ విషయంలో ఒక అంచనాకు రాకపోవడం ఏంటి అన్నది అర్థం కావడం లేదు.
ఈ సినిమాకు రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ.. చివరికి మోనార్క్ అనే టైటిల్ ఖరారైనట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. మరి అదో మరొకటో కానీ.. ఇంకా పేరు పెట్టకపోవడమేంటో అర్థం కావడం లేదు. విడుదలకు ఇంకో నాలుగు నెలల కంటే తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఓ పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేసేస్తే సినిమా ప్రచారానికి ఉపయోగపడుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on February 1, 2021 10:16 am
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…