హాట్ ఫోటో: స్విమ్మింగ్ పూల్ లో దొరసాని!

రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక ‘దొరసాని’ చిత్రంతో పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫెయిల్ అవడంతో ఆమెకు ప్రస్తుతానికి అవకాశాలు లేవు. మొదటి సినిమాలో అచ్చమైన భారతీయ నారిగా కనిపించిన శివాత్మిక ఇన్స్టాగ్రామ్ లో మాత్రం చాలా గ్లామరస్ ఫోటోలు పెడుతోంది. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. శివాత్మిక కూడా అందుకే అప్పటి మధుర స్మృతులను నెమరు వేసుకుంటోంది. గత సంవత్సరం సింగపూర్ వెళ్ళినపుడు స్విమ్మింగ్ పూల్ లో సేద తీరుతూ దిగినప్పటి ఫోటో ఇదట. శివాత్మిక గ్లామర్ కి నెటిజన్ల నుంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.