స్టార్ హీరోల పుట్టిన రోజులో, ఇంకేవైనా మంచి సందర్భాలో వచ్చినపుడు ముందు రోజు నుంచే సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేయడం మొదలుపెడతారు. పోటీ పడి ట్వీట్లు వేస్తారు. దీన్నో ఉద్యమంలాగా కొనసాగిస్తారు. ఐతే ఒక కమెడియన్‌కు, అది కూడా వయసు మళ్లి, దాదాపు సినిమాలు మానేసి, లైమ్ లైట్లో లేని వ్యక్తికి ఇలా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే.
ఇప్పుడు అలాంటి గౌరవం దక్కించుకున్న వ్యక్తి మరెవరో కాదు.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. ఫిబ్రవరి 1న ఆయన పుట్టిన రోజు. ఈసారి ఆయనకు 65 ఏళ్లు నిండుతున్నాయి. ఐతే ఎన్నడూ లేని విధంగా బ్రహ్మి ఈ పుట్టిన రోజుకు సోషల్ మీడియాలో విపరీతమైన హంగామా కనిపిస్తోంది. ఇదేమీ ఎవరో వెనుక ఉండి చేయిస్తున్న హడావుడి కాదు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా మూడు దశాబ్దాలకు పైగా అన్ని రకాల ప్రేక్షకులను తన హాస్యంతో అలరించిన బ్రహ్మికి నేటి యువత ప్రేమతో అందిస్తున్న కానుక. ముందు రోజు మధ్యాహ్నం నుంచే #hbdbrahmanandam అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి నెటిజన్లు ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు.
బ్రహ్మి హావభావాలతో కూడిన ఫొటోలు, వీడియోలు, ఆయన అద్భుత రీతిలో కామెడీ పండించిన సన్నివేశాలతో సోషల్ మీడియాలో హోరెత్తించేస్తున్నారు. కొన్నేళ్ల నుంచి బ్రహ్మి పెద్దగా సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో ఆయన ఎప్పుడూ చర్చల్లోనే ఉంటారు. ఎవరు ఏ హావభావాన్ని వ్యక్తం చేయాలన్నా బ్రహ్మి ఫొటోనో, వీడియోనో, జీఐఎఫ్పో ఉండాల్సిందే.
తెలుగు వాళ్లే కాక వేరే భాషల వాళ్లు సైతం వివిధ రకాల ఎక్స్‌ప్రెషన్లకు బ్రహ్మినే వాడుకుంటున్నారు. ఇలా ఆయన కోట్లాది మంది గుండెల్లో స్థానం సంపాదించుకుని తన పాపులారిటీని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బ్రహ్మి పుట్టిన రోజు హ్యాష్ ట్యాగ్ ఇండియా లెవెల్లో ట్రెండ్ అవుతుండటం విశేషం.
This post was last modified on February 1, 2021 7:53 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…